Telugu News

చెక్కులు రాసుకోని నొక్కేశారు

= కోటి 27 లక్షల 8 వేల 324 రూపాయల నిధుల దుర్వినియోగం

0

చెక్కులు రాసుకోని నొక్కేశారు

== కోటి 27 లక్షల 8 వేల 324 రూపాయల నిధుల దుర్వినియోగం
== సర్పంచ్,ఉప సర్పంచ్ భర్తలు కలిసి భారీ మొత్తంలో పంచాయతీ నిధులు స్వాహా
== నిధుల దుర్వినియోగం నిరూపణ అవడంతో మూడు నెలలు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్)

సర్పంచ్ ఉప సర్పంచ్ భర్తలు కలిసి భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ప్రకంపనలు రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా కోటి 27 లక్షల 8 వేల 324 రూపాయల నిధులు పాల్పడినట్లు అధికారుల విచారణలో బహిర్గతమైంది. ఓ సాధారణ గ్రామపంచాయతీలో కోటికి పైగా నిధుల దుర్వినియోగం అయిన తీరు తీవ్ర కలకలం కలిగిస్తోంది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళిద్దరి భర్తలు కూడా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో కఠిన చర్యలకు అధికార యంత్రాంగం జంకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాధనం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు ప్రజాప్రతినిధులను, వారి భర్తల పై ఈగ వాలకుండా ఓ ఎమ్మెల్యేలతో పాటు, మరి కొందరు ప్రజాప్రతినిధులు వారిని కాపాడుతున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జారీచేసిన షోకాజు నోటీసు ప్రకారం బోరబండ మండలం నాగినేని ప్రోలు గ్రామపంచాయతీలో ఈ భారీ మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. నిధుల, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సర్పంచ్ భూక్య శ్రావణి పై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37 (1), సెక్షన్ 37 (5) ల లోని నియమాల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

also read :- ఖమ్మంలో కాంగ్రెస్ విన్నూతన నిరసన

ఇది జరిగిన బాగోతం :-

జిల్లా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసు ప్రకారం మండల పంచాయతీ అధికారి 2021 జూన్ 18వ తేదీన ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక సమర్పించారు. ఆయ వేదిక ప్రకారం సర్పంచ్ బి శ్రావణి, ఉప సర్పంచ్ ఝాన్సీ లక్ష్మి, వారి భర్తలు బి శివ కృష్ణ, వై శివారెడ్డి పేర్లమీద నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు రాసి,నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. సర్పంచ్ ఉప సర్పంచ్ అలా భర్తలు గ్రామపంచాయతీ పరిపాలన అంశాల్లో జోక్యం చేసుకున్నారని నిర్ధారించారు.

సర్పంచ్ శ్రావణి ఆమె భర్త శివ కృష్ణ పేర్ల మీద మొత్తం 66 చెక్కుల ద్వారా 72,73,612 రూపాయలు, ఉప సర్పంచ్ ఝాన్సీ లక్ష్మి ఆమె భర్త శివారెడ్డి ల పేర్ల మీద 50 చెక్కుల ద్వారా 54,34,712 రూపాయల నగదును డ్రా చేశారు. విచారణ అధికారి నివేదిక ప్రకారం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు 58,89,688 రూపాయల మొత్తాన్ని ఖర్చు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఎక్కువ బిల్లులు సర్పంచ్, ఉప సర్పంచ్,వాళ్ళ భర్త పేరు మీద చెక్కులు రాశారు. అంతేగాక చేసిన పనుల కన్నా బిల్లులు ఎక్కువ మొత్తంలో డ్రా చేసినట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ లో 9 మంది ఉన్నప్పటికీ, అవసరానికి మించి పారిశుధ్య సిబ్బందిని నియమించి అధిక మొత్తంలో బిల్లులు డ్రా చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీ చేసినప్పుడు అసలు పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు కూడా కనిపించలేదు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ అంశంలో సర్పంచ్ ఉప సర్పంచలు నిర్లక్ష్యం వహించే నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

also read :- నేడు భట్టి పాదయాత్ర

సొంత పేరు పైన చెక్కులు :-

వాస్తవానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు జారీ చేసే సమయంలో చెల్లింపులు వ్యక్తుల పేర్ల పై రాయకూడదు. పనులు నిర్వహించిన సంస్థల పేర్ల పై మాత్రమే చెక్కుల రూపంలో చెల్లింపులు జరగాలని జీవో ఎంఎస్ నంబర్ 432/ 2013 నిర్దేశిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ చెక్కులు సర్పంచ్ ఉప సర్పంచ్ వారి భర్తల పేర్ల పైన రాసి నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37 (1),37(5) లోని నియమాల ప్రకారం సర్పంచ్ శ్రావణి పై ఎందుకు చర్యలు తీసుకోరాదని తెలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గత ఫిబ్రవరి 7వ తేదీన షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజు నోటీసు అందిన మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని లేని పక్షంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని కలెక్టర్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ భారీ మొత్తం నిధుల దుర్వినియోగం లో మండల పంచాయతీ అధికారి నివేదిక సమర్పించి తొమ్మిది నెలలు దాటింది. నిరుడు జూన్ 18వ తేదీన ఆయన రిపోర్ట్ సమర్పించినట్లు ప్రస్తావించారు. పంచాయతీ అధికారి నివేదిక సమర్పించిన 7 నెలల తర్వాత గాని నిధుల దుర్వినియోగంపై షోకాజ్ నోటీసులు జారీ కాలేదు.

also read :- దేశానికి శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరా?

ఎట్టకేలకు చర్యలు:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు గ్రామ సర్పంచ్ శ్రావణి , ఉప సర్పంచ్ ఝాన్సీ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువు అవ్వడం వలన సర్పంచ్ ,ఉప సర్పంచ్ లను మూడు నెలలు సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్.