Telugu News

ఖమ్మం నగరం అద్దంలా తయారు చేశాం

== ఏడాది కాలంలో సుస్థిర అభివృద్ధిని సాధించాం

0

ఖమ్మం నగరం అద్దంలా తయారు చేశాం

== ఏడాది కాలంలో సుస్థిర అభివృద్ధిని సాధించాం

== ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గానికి మంత్రి అజయ్ శుభాకాంక్షలు

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
ఖమ్మం నగరంను అద్భుతంగా తీర్చిదిద్ది అద్దంలా, అందరు ఈర్శ పడే విధంగా అభివృద్ది చేశామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వా అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ టీమ్ చాలా కష్ట పడి పనిచేస్తున్నారని, ప్రతి డివిజన్ లో అద్భుతమైన అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 60ఏళ్ల పాటు అభివృద్దికి నోచుకుని ఖమ్మంను ఒకే సంవత్సరంలో అద్భుతంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు.శనివారంతో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తి చేసుకుంది.

also read :-నరేంద్ర మోడీనే దేశానికి రక్ష

ఈ సందర్భంగా రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాలకవర్గ సభ్యులకు, ఖమ్మం నగరమేయర్ కు అభినందనలు తెలిపారు.రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ అండదండలు, మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఖమ్మం అభివృద్ధి వివక్షకు గురైందని మంత్రి అజయ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాక ముందు నగరంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. నగర అభివృద్ధిలో కీలకమైన తాగునీరు,

కరెంటు సరఫరా, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా అధ్వర్యంలో నగరాభివృద్ధి సాధనలో ఖమ్మం దూసుకెళ్తున్నదని, సుస్థిర అభివృద్ధిని సాధించామని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం ప్రగతికి తన సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని మరింత ప్రగతి సాధనకు కార్పొరేటర్లు అందరూ కార్యోన్ముఖులు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.