ఖమ్మంలో సీఎల్పీ నేతకు ప్రజల అభిమాన వర్షం
== బ్రహ్మరథం పట్టిన జనం
== భారీగా తరలివచ్చిన ప్రజానీకం.. అడుగడుగన నిరాజనాలు
== సరిహద్దులో గజమాలలతో సత్కారం..
== భట్టిని చూసేందుకు ఎగబడిన జనం
== జిల్లా సరిహద్దులో స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షుడు, జిల్లా నేతలు
== దాదాపు మూడు నెలల తరువాత జిల్లాలోకి అడుగుపెట్టిన సీఎల్పీ నేతను చూసేందుక రహదారికి ఇరువైపులా నిలబడ్డ ప్రజలు
== అందరికీ అభివాదం చేస్తూ.. పేరుపేరునా పలకరిస్తూ ముందుకు సాగిన పాదయాత్రికుడు
== మహాపాదయాత్ర చేస్తూ వస్తున్న భట్టి విక్రమార్క వెంట నడిచేందుకు పోటీపడ్తున్న ఖమ్మం జిల్లా ప్రజలు
(కూసుమంచి-విజయంన్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల అభిమాన వర్షం కురిపించారు. అదిలాబాద్ జిల్లా పిప్పిరి నుంచి ప్రారంభమైన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లాకు చేరింది. సుమారు 104 రోజుల తరువాత 1250 కిలోమీటర్ల దూరం పాటు నడిచిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 105వ రోజు ఖమ్మం జిల్లాకు చేరింది. దీంతో ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామం వద్ద జిల్లా, మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ ద్రోహి కందాళ: భట్టి విక్రమార్క
మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చరణ్ రెడ్డి, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్ ఘనంగా స్వాగతం పలికారు. రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గజమాలతో సత్కారం చేశారు. ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంలో జన నాయకుడు భట్టి విక్రమార్కపై అంతులేని అభిమానాన్ని చూపిన ప్రజలు, దాదాపు మూడు నెలల తరువాత జిల్లాలోకి అడుగుపెట్టిన సీఎల్పీ నేతను చూసేందుకు ప్రజలు రహదారికి ఇరువైపులా నిలబడ్డ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ.. పేరుపేరునా పలకరిస్తూ ముందుకు సాగిన పాదయాత్రికుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంట నడిచేందుకు ఖమ్మం జిల్లా ప్రజలు పోటి పడ్డారు. అడుగడున పూలవర్షం కురిపించారు. మహిళలు అడుగడుగున హరతులిచ్చి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మట్టెగురవయ్య, కళ్లేం వెంకట్ రెడ్డి, ఓబీసీ నాయకుడు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు మొక్కా శేఖర్ గౌడ్, ఓయూ జేఏసీ నాయకులు గంగదేవుల లోకేష్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, బాలాజీ నాయక్, పెండ్ర అంజయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, ఎస్టీసెల్ అధ్యక్షుడు రాందాసునాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హుస్సెన్, వినోద, బాణోత్ దివ్య, ఏలూరి రజని, గుడుపూడి ఝాన్సీ, నాగండ్ల దీపక్ చౌదరి, బెల్లం శీను, ప్రవీణ్ నాయక్, రాందాస్ నాయక్, సున్నం నాగమణి, దేవి ప్రసన్న, కోటేశ్వర రావు, మోత్కూరి ధర్మారావు, నల్లపు దుర్గాప్రసాద్వ, వడ్డే నారాయణ రావు, నూతి సత్యనారాయణ, నాయుడు సత్యం, బుల్లెట్ బాబు, ఇల్లందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రవి, ఎండీ.హాఫీజుద్దీన్,యడవల్లి రాంరెడ్డి, దాసరి వెంకన్న, నాగిరెడ్డి రమేష్ రెడ్డి, మద్ది వీరారెడ్డి, గొల్లపూడి వీరన్న, బీష్మాచారి, బచ్చలకూర నాగరాజు, అంజని, బెల్లి శ్రీశైలం, బొంగానాయక్, బుస్సా మాదవ్ రెడ్డి, లచ్చునాయక్, మంచా, బాసునాయక్, హరినాథ్ నాయక్, ఆశ్వారావు పేట, మణుగూరు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు