Telugu News

అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన సీఎం

పది మంది అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన సీఎం కేసీఆర్

0

అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన సీఎం

== పది మంది అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన సీఎం కేసీఆర్

== 51 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు మనవే

== హర్షం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదివారం అందులో కొంత మందికి బీఫామ్ లను అందజేశారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో హాజరైన సీఎం కేసీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 51 నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్ లను సభా వేదికలోనే పంపిణి చేశారు.

ఇది కూడా చదవండి:- బిగ్ బ్రేకింగ్.. భద్రాచలం లో విషాదం

 అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 10 మందికి బీఫామ్ లను స్వయంగా సీఎం కేసీఆర్ అందజేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, సండ్రవెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, భద్రాచలం ఇంచార్జ్ తెల్లం వెంకట్రావ్ లకు బీఫామ్ లను అందజేశారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఇదే..|

ఈ సందర్భంగా అభ్యర్థులు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కొంత మంది పాధాభివందనాలు చేసి ఆశీర్వాదం పొందారు. బీఫామ్ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కచ్చితంగా గెలిచివచ్చి మీకు గిప్ట్ గా ఇస్తామని హామినిచ్చారు. బీఫామ్ లు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణి చేశారు.