Telugu News

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థే కీలకం..

సొసైటీ అధ్యక్షులు రెడ్డం వీర మోహన్ రెడ్డి..

0

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థే కీలకం..

సొసైటీ అధ్యక్షులు రెడ్డం వీర మోహన్ రెడ్డి..

తల్లాడలో ఘనంగా సహకార వారోత్సవాలు..

సమాజంలో రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతో కీలకంగా ఉందని తల్లాడ సహకార సొసైటీ చైర్మన్ రెడ్డం వీరమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సహకార వారోత్సవాలు భాగంగా తల్లాడ సొసైటీ కార్యాలయంలో ఆయన జెండాను ఆవిష్కరించారు. తొలుత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరమోహన్ రెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థలో భాగంగా రైతులు సబ్సిడీతో అనేక సౌకర్యాలను పొందుతున్నారని గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలు, సబ్సిడీతో యంత్రాలు తదితర రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గి దేవర వెంకట్ లాల్ మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె. ఈసూబ్, సొసైటీ సీఈఓ నాగబాబు, సొసైటీ ఉపాధ్యక్షులు రేగళ్ల సత్యం, సొసైటీ డైరెక్టర్లు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, గోవిందు శ్రీనివాసరావు, గుంటుపల్లి వెంకటయ్య, కటికి నరసింహారావు, జమలయ్య, గుగులోతు సత్యం, మారెళ్ళ దేవేందర్, సర్పంచ్ సర్పంచులు నారపోగు వెంకట్, నీలాద్రి ఆలయ డైరెక్టర్ పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి), జోన్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, రాయల తిరుమలయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి.వి.ఆర్), టిఆర్ఎస్ బీసీ సెల్ నాయకులు సరికొండ కస్తూరి రాజు, వజ్రాల రామిరెడ్డి, వేమిరెడ్డి నాగిరెడ్డి, ఏలూరి వెంకటయ్య, బెల్లంపాటి అనంత రాములు, తేళ్లూరి రఘు, పాలేటి లక్ష్మీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ ;- ఈ దేశం నెహ్రూను ఎన్నటికీ మరువదు: బలరాం నాయక్.