Telugu News

కాంగ్రెస్ కార్పోరేటర్ ప్రోద్బలంతోనే మాపై దాడి

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

0

కాంగ్రెస్ కార్పోరేటర్ ప్రోద్బలంతోనే మాపై దాడి

== దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

== విలేకరుల సమావేశంలో బాధితులు పేరసాని సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులు

ఖమ్మం, సెప్టెంబర్ 7(విజయంన్యూస్):

ఖమ్మంనగరంలో కార్పోరేటర్ గా పనిచేస్తున్న మిక్కిలేని మంజుల భర్త మిక్కిలేని నరేందర్ ప్రోద్భలంతోనే మాపై కొందరు వ్యక్తులు దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కారులో వచ్చి కిడ్నాప్ చేసి గదిలో బంధించి, దాడిచేసి బలవంతంగా భూమిని అమ్మినట్టు బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరసాని సత్యనారాయణ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేరసాని సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ… ఖమ్మం నగరం కవిరాజు నగర్ లోని నివాసముంటున్నామని, వ్యాపారం నిమిత్తం 2016లో అదే కవిరాజ్ నగర్ కు చెందిన కర్నాటి సీతారాముల వద్ద రూ.3 వడ్డీకి రూ. 8.5 లక్షలు అప్పుగా తీసుకున్నామని, దానికి సంబంధించి, మా భూమికి చెందిన ఒరిజినల్ పాస్ బుక్, రెండు ఖాళీ చెక్కులు, ఒక ప్రాంసరి నోటు సంతకాలు చేసి తీసుకున్నారని ఆరోపించారు.

allso read- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

కామేపల్లిలోని సర్వే నెంబర్ 244/4 లో గల ఎ౹౹ 2.27 కుంటల భూమికి వచ్చే కౌలుతో పాటు, వడ్డీ డబ్బులు కూడా కడుతున్నామని తెలిపారు. అయినా ఇంకా రావాలని వేధిస్తున్నారని వాపోయారు. ఈ నెల సెప్టెంబర్ 5న కాంగ్రెస్ కార్పోరేటర్ భర్త మిక్కిలినేని నరేంద్ర, కర్నాటి సీతారాములు అనుచరులు సర్దారు, సురేష్ కత్తులతో వచ్చి బెదిరించారని ఆరోపించారు. మరలా సెప్టెంబర్ 6న సాయంత్రం 4 గంటలకు మిక్కిలినేని నరేంద్ర అనుచరులు కర్ణాటి సీతారాములు, సర్దార్ సురేష్ లు వచ్చి నన్ను, నా కొడుకు కిషోర్ ను కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకొని మిక్కిలినేని నరేంద్ర అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లి సెల్లార్ రూమ్ లో బంధించి రాత్రి వరకు ఉంచి, మా భూమిని కల్తీ బుచ్చయ్య అనే ఎస్టి అతనికి, ఆయన లేకుండానే 100 రూపాయల బాండ్ పేపర్ పై రూ. 40 లక్షలకు అమ్మినట్లు బలవంతంగా దాడి చేసి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయల విలువచేసే భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు చేస్తున్న కుట్రపై జిల్లా అధికారులు స్పందించి విచారణ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో భార్య నాగమణి, కొడుకు కిషోర్, కూతురు ప్రియాంక పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: తుమ్మల  చేరికు అప్పుడే..?