Telugu News

సోములగూడెం ప్రజలతో  పోట్ల మాట ముచ్చట

0

సోములగూడెం ప్రజలతో  పోట్ల మాట ముచ్చట

== సమస్యలను అడిగి తెలుసుకున్న పోట్ల

(కొత్తగూడెం-విజయంన్యూస్)

పాల్వంచ మండలం సోములగూడెం గ్రామంలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారి కష్టాలు లేని ఇంద్రమ్మ రాజ్యమే లక్ష్యంగా  కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేదవాడికి 500 రూపాయలకే సిలిండర్ మరియు భూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకోడానికి 500000 రూపాయలు ప్రభుత్వ మంజూరు చేస్తుందని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో వారితోపాటు టిపిసిసి సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి, రావూరి నాగేశ్వరరావు,గరిపేట ఎంపీటీసీ కసానబోయిన భద్రం, కొత్తగూడెం యువజన కాంగ్రెస్  అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, జిల్లా ఓబీసీ నాయకులు అల్లాడి నరసింహారావు, జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీర సురేష్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షులు జమ్ముల రాజశేఖర్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు కాప శ్రీనివాస్, పాల్వంచ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హెచ్ మధు, భోగి సత్తమ్మ, మరియు సోమల గూడెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

ఇది కూడా చదవండి: ఔటర్‌ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి