Telugu News

శీనన్న ఆ గట్టునా..? ఈ గట్టునా..?

పొంగులేటి దారేటు..? ఫార్ట్-1

0

ఆ గట్టునా..? ఈ గట్టునా..?

== అంతా శీనన్న మయం

== పార్టీ మారే నిర్ణయం పట్ల తీవ్ర ఉత్కంఠ

== కాంగ్రెసా, బిజెపా అంటూ అభిమానులు ఎదురుచూపు

== తన నిర్ణయం ప్రకటిస్తే సంబరాలకు సిద్ధం

== ఫిబ్రవరిలోనే చిక్కుముడి వీడేది అంటున్న అనుచరులు

== పొంగులేటి దారేటు..? ఫార్ట్-1

(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయంన్యూస్)

ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లా కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన శీనన్న గురించి చర్చి నడుస్తుంది. నలుగురు జమ కూడరంటే ప్రస్తుత రాజకీయాలే మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారూ, కాంగ్రెస్ లోకి వెళ్తారా..? బిజెపి వైపు వెళ్తారా అంటూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గంలో శీనన్న జపం ఎక్కువైంది. ఇటీవలే పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం నిర్వహించడం, అధికార పదవిలో ఉన్న జడ్పీచైర్మన్ ఆయన వైపు వెళ్లడం, భారీగా జనం తరలిరావడం, మరో వైపు స్థానిక ఎమ్మెల్యే అదే రోజు ఆత్మీయ సమ్మెళనం పెట్టడం, పరస్పర విమ్మర్శలు చేసుకోవడంతో ఇల్లందులో హాట్ టాఫిక్ రాజకీయంగా మారింది.  ఈ నేపథ్యంపై ‘విజయం ప్రతినిధి’ ప్రత్యేక కథనం.

ఇది కూడా చదవండి: 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి

ఖమ్మం ఉమ్మడి జిల్లా కు ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. జనబలం కల్గిన నాయకుడ్ని ఆయన్ను ఒక్క సారి అభిమానిస్తే, ఆ జనం ఆయనంటే నిలబడతారు. ఆయనతోనే జీవతం కొనసాగిస్తారు.. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది. ఒక్కసారి ఆయన్ను నమ్మిన జనం, ఆయనతోనే కదులుతున్నారు. అధికార పార్టీ వీడుతున్నప్పటికి ఆయనతో పెద్ద సంఖ్యలో జనం ఆయనతోనే కదలడం, ఆయన వెంటే వెళ్లడం రాజకీయ మలుపులకు దారితీసే అవకాశం ఉంది. ఆయన వెంట వెళ్తున్న జనంను చూస్తుంటే అధికారం అవసరం లేదు.. జనబలం ఉంటే చాలు అన్నట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం మారింది.  వ్యక్తిని అభిమానిస్తే పార్టీ అనేది పక్కన పెట్టి అండగా నిలబడే సత్తా ఉన్న జిల్లా ఖమ్మం ఇప్పుడు అదే పరిస్థితి కనపడుతుంది.పొంగిలేటి నిర్ణయం పట్ల ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

==  నిర్ణయం ఏదైనా సరే వన్ సైడ్ అంటున్న జనం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయన అధికార పార్టీని వీడి, ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్లేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఆయన వెంట వేలాధి మంది జనం తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారా అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఆయన ముందుగా బీజేపీ పార్టీలోకి వెళ్తారని భావించినప్పటికి, ఆ తరువాత రాజకీయ పరిణామాల వల్ల కొంత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

ఇది కూడ చదవండి: 24గంటల కరెంట్ పై  చర్చకు సిద్ధమా:తాతా మదు

వారి ఆలోచన మేరకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పినపాక, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో సమ్మెళనాలను ఏర్పాటు చేసిన పొంగులేటి అతిత్వరలో మరో నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమ్మెళనాలు పెట్టే అవకాశం ఉంది. అయితే కార్యకర్తలు, ఆయన ఆభిమానులు మాత్రం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వెంటే నడిచేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఏదైనా వార్ వన్ సైడ్ అంటున్న ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీలో నిలబడేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారు.  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకా నాంచుడు అవసరం లేదని, త్వరగా నిర్ణయాన్ని ప్రకటించి ఉత్కంఠకు తెరదించాలని అభిమానులు, నాయకులు కోరుతున్నారు. అందుకోసం ఎదురుచూస్తున్నారు.

== ఆచితూచి అడుగు

అధికార పార్టీలో కొనసాగిన పొంగులేటి, తనకు జరిగిన అవమానాలను పటాపంచల్ చేస్తూ అధికారపార్టీపై యుద్దానికి సిద్దమైయ్యారు. అయితే ఈ యుద్దానికి బలాన్ని ఇచ్చే పార్టీ కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ బలాన్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పొంగులేటి మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ స్థానిక రాజకీయం అవసరం కాబట్టి కొంత ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు మక్కువ చూపిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంత రాజకీయ పరిణామాలు ఆయన్ను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఇల్లెందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత కుమ్ములాటలు, పార్టీని బలహీన పరుచుకోవడం, ఒకరిపై ఒకరు విమ్మర్శలు చేసుకోవడం ఫలితంగా ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కార్యకర్తలు, అభిమానులు, ఆయన వెంట వచ్చే నాయకత్వం కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్తే 10కి పది స్తానాలను,రెండు ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఇటీవలే కొత్త ప్రచారం ముందుకు వచ్చింది. పొంగులేటి వైఎస్ఆర్ టీపీ లో చేరతారనే కథనాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే షర్మిళను కలిశారని, ఆయన షర్మిళకు మాటిచ్చారని వార్తలు ప్రచారమైయ్యాయి. వైఎస్ షర్మిళ కూడా నాకు మాటిచ్చారని చెప్పకనే చెప్పింది. ఈ విషయాన్ని పొంగులేటి కొట్టిపారేశారు. అయితే తన పక్కన వారికి టిక్కెట్లు రావాలంటే వైఎస్ఆర్ టీపీ పార్టీ తప్ప మరోక్క పార్టీ లేదు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పదికి పది స్థానాలను ఇచ్చే అవకాశం లేదు. పదికి పది ఇవ్వాలంటే వైఎస్ఆర్ టీపీ తప్ప మరోక్కటి లేదు. దీంతో  పొంగులేటి పరిస్థితి ఆ గట్టునా..? ఈ గట్టునా..? అన్నట్లుగా తయారైంది పొంగులేటి పరిస్థితి. అయితే పొంగులేటి మాత్రం చాలా అచితూచి అడుగులేస్తున్నారనేది వాస్తవం. ఫిబ్రవరి లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఉందని, ఆయన కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

== ఇల్లందులో పరిస్థితి ఏంటి?

ఇల్లందులో పరిస్థితి ఈ భిన్నంగా ఉంది. ఇటీవల పొంగిలేటి కోరం ఆత్మీయ సమ్మేళనానికి అభిమానులు ప్రజాప్రతినిదిలు పెద్ద ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసింది. ఊహించిన విధంగా తరలివచ్చారు ప్రతి నియోజకవర్గంలో గాని ఇల్లందులో కూడా శీనన్నకు 50 వేల ఓట్ బ్యాంకు ఉంటుందని తెలుస్తుంది. దానికి తోడు కోరం యాడ్ అయితే విజయం నల్లేరు మీద నడకే. ఇటీవల తీన్మార్ మల్లన్న విశ్లేషణ చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో 50 ఓట్లు పక్కా శ్రీనివాస్ రెడ్డి వైపు ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. ఇక ఏ పార్టీకి వెళ్లిన ఆయన బలంగానే ఉంటారనే ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం.. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎటువైపు తిరుగుతాయో..?