Telugu News

రైతు సంఘర్షణ సభ ను విజయవంతం చేయాలి..

అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ అండ

0

రైతు సంఘర్షణ సభ ను విజయవంతం చేయాలి..

అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ అండ

కాంగ్రెస్ పార్టీ ST సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న.

(గజ్జెల. రాజశేఖర్–తాడ్వాయి  విజయం న్యూస్):-

రైతు సంఘర్షణ సభను విజయంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ST సెల్ జిల్లా కార్యదర్శి పీరిల. వెంకన్న అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సంఘర్షన సభ కొరకు యువనేత రాహుల్ గాంధీ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నందు జరుగు సభకు హాజరు అవుతున్నందున అట్టి సభను విజయవంతం చేయాలని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస పార్టీ అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి ఇప్పటివరకు ధనిక తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని , పంట పండించే రైతులు శ్రమను మిల్లర్ల ద్వారా దోచుకు తిన్న, రాష్ట్ర ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని, పంట పండించిన ధాన్యపు గింజలను కొనకుండా కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వాలు దోచుకుంటూ రైతుల ఉసురు పోసుకుంటున్నరని అన్నారు.

also read :-బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించ కుండ అలసత్వం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ధర్నాలకు దిగితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాం అని నిర్ణయం తీసుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ న్నారని అన్నారు.కరోరెట్ పాలనతో కేంద్రం, రాచరిక పాలనతో రాష్ట్రం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని , ఆరు నెలలు పండించిన పంటను కొనే నాధుడు లేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్న రని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు రైతులకు పెద్ద పీట చేశాయని ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉంటూ ఉచిత విద్యుత్, ఇందిర జలప్రభ, పంట రుణాలు, ఏక కాలంలో పంట రున మాఫీ , పంట నష్టం, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ తైవాన్ పంపులు అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అన్నదాతను గుండెల్లో పెట్టుకుందని అన్నారు.సభకు మండలం లో అధిక సంఖ్యలో హాజరు కావాలని అన్నారు.