Telugu News

యాదాద్రి మీద ఉన్న శ్రద్ధ రామయ్య మీద లేదా….

ఆరేళ్లుగా సీఎం లేకుండానే బ్రహ్మోత్సవాలు.....

0

యాదాద్రి మీద ఉన్న శ్రద్ధ రామయ్య మీద లేదా

** ఆరేళ్లుగా సీఎం లేకుండానే బ్రహ్మోత్సవాలు

** పురాతన సంప్రదాయానికి మంగళం

** మంత్రులే తెస్తున్న ముత్యాల తలంబ్రాలు

** నెరవేరని సుందర భద్రాద్రి స్వప్నం

** తీవ్ర ఆవేదనలో రామభక్తులు

(చండ్రుగొండ -విజయం న్యూస్ )

రామగిరి’ భద్రగిరి అని తెలంగాణ రాష్ట్రానికి మకుటం లాంటిది… స్వయంగా రాముడు నడిన నేలను అప్పటి,ఇప్పటి పాలకులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు… దక్షిణ భారత అయోధ్య గా అని పిలువబడే ఈ భద్రగిరిని కి సుదీర్ఘ చరిత్ర కలిగినది రామ క్షేత్రం. Aశ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై సంచరించిన పుణ్య నేల. తరతరాలుగా ఇక్కడ సంప్రదాయబద్ధంగా జరిగే శ్రీరామనవమి వేడుక దేశవ్యాప్త కొలమానం. ఆనాటి తానీసా కాలం నుంచి శ్రీ సీతా రాములవారి వేడుకల గౌరవ మర్యాదలకు లోటు లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు అందరూ… రాములోరి కల్యాణంకు ప్రతిసారి హాజరై తరతరాల సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేవారు .

also read;-బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

నవ తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కె.సి.ఆర్ ఒక్కసారే… రాములోరి కళ్యాణంకు హాజరయ్యారు. గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ భద్రాచలంలో జరిగే స్వామివారి కల్యాణంకు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రతి ఏటా మంత్రులు మాత్రమే హాజరై స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేస్తున్నారు. తరతరాల సంప్రదాయానికి బ్రేక్ పడటంతో రామ భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదైనా సీఎం కెసిఆర్ భద్రాద్రికి వస్తారా…? లేదా అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.సుందర భద్రాద్రి ప్రగతికి రూ.100 కోట్ల సీఎం ప్రకటన కూడా… కాగితాలకే పరిమితమైంది. భద్రాద్రి రాముడు… తెలంగాణ దేవుడు అని ఉద్యమ సమయంలో…. భద్రాద్రిలో పోటెత్తిననినాదాలు స్థానికుల హృదయాల్లో ఇప్పటికీ ఉప్పొంగు తూనే ఉన్నాయి….

also read;-టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో ద‌ద్ద‌రిల్లిన లోక్‌స‌భ‌

రాముని గడ్డకు రాని సీఎం కేసీఆర్….
భద్రాచలం దివ్య క్షేత్రములో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుక కనుల పండువగా జరుగుతుంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు హాజరు అవుతారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మరుసటి రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు రాష్ట్ర గవర్నర్ హాజరు కావటం పరిపాటి. తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని ఆయా ముఖ్యమంత్రులు, గవర్నర్లు పాటిస్తూ వచ్చారు. నవ తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ కూడా 2015 సంవత్సరంలో భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలు స్వామివారికి అందజేశారు.

ఆ మరుసటి సంవత్సరం నుంచి…. ఎందుకో ఏమో కానీ…. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాకుండా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర మంత్రులే ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలు స్వామివారి కల్యాణం సందర్భంగా అందజేస్తున్నారు. గత రెండేళ్లుగా మాత్రం…. కరోనా నేపథ్యంలో స్వామివారి కల్యాణాన్ని కేవలం అర్చక స్వాములు, కొద్దిమంది విఐపిల ఆధ్వర్యంలోని స్వామివారి కళ్యాణం జరిపారు. గత ఆరేళ్లుగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరవుతారని రామ భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్పటికీ… అది నిరాశగానే మిగిలింది. ఈ ఏడాదైనా…. శ్రీ సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా…? లేదా అని భక్తులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు

నెరవేరని సుందర భద్రాద్రి స్వప్నం…
తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ 2015 లో భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు వచ్చారు. భద్రాచలం హెలిప్యాడ్ వద్ద ఆనాడు సీఎం ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. భద్రాచలం దివ్య క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని… అందుకు రూ 100 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని తెలిపారు. పర్ణశాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కొద్దిరోజుల్లోనే తాను భద్రాచలం వచ్చి ఇక్కడ రెండు రోజులు మకాం పెట్టి అన్ని ప్రాంతాలు చూసి యాదాద్రిలా భద్రాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం మాత్రం భద్రాచలం రాకపోగా…. అప్పటికప్పుడు ఆర్కిటిక్ ఆనందసాయి సహకారంతో సుందర భద్రాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు కూడా…. భద్రాచలం వచ్చి ఈ మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దారు. సుందర భద్రాద్రి డిజైన్ కూడా ప్రెస్ కు రిలీజ్ అయింది.

also read;-కేవిఆర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

ఒక్కసారిగా ఏమైందో ఏమో కానీ…. ఆ సుందర భద్రాద్రి మాస్టర్ ప్లాన్ అటకెక్కింది. నేటి వరకు దీని గురించి అతి గతి లేదు. రూ.100 కోట్ల కేటాయింపుపై… ప్రతిపక్షాలు అడపాదడపా అడుగుతున్న అప్పటికి… ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ స్థల సమస్య నెలకొందని…. అప్పుడప్పుడు గులాబీ ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వచ్చారు. కంటితుడుపు చర్య లో భాగంగా… ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో డివైడర్స్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టారు. రామాయణం పార్కు ఏర్పాటు కలగానే మిగిలింది. వేద పాఠశాల అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. భద్రాచలం దివ్యక్షేత్రం ప్రగతికి పూను కుంటామని…. తెలంగాణ పలువురు ప్రజా ప్రతినిధులు చెప్పుకుంటున్నప్పటికీ అది ఆచరణకు ఏ మాత్రం నోచుకోవడం లేదు. దీంతో రామ భక్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఉద్యమకాలంలో భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు…. అంటూ స్థానిక రామభక్తులు గొంతెత్తి నినాదాలు చేశారు….

also read;-ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

భద్రగిరిపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంతో రామ భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కు కనీసం…. ఇప్పటివరకు పాలకమండలి సైతం నెలకొల్పిన పరిస్థితి లేదు. దీంతో అధికారుల పాలనే రాజ్యమేలుతోంది. దేవస్థానం ఆదాయం రోజురోజుకు కుంటుపడుతోంది. సౌకర్యాల లేమితో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు భద్రాచలం పట్టణం తప్ప గ్రామీణ ప్రాంతం ఆంధ్రాలో కి వెళ్లిపోవడంతో… సరిహద్దు సమస్యలు ఏర్పడుతున్నాయి. రాములోరి దేవుని మన్యం మొత్తం మాన్యం అంతా ఆంధ్రలో ఉండగా రామాలయం మాత్రమే తెలంగాణాలో ఉండిపోయింది.

భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు లేకపోవడంతో ఇక్కడ కూడా అధికారుల పాలనే కొనసాగుతోంది. భద్రాచలం మున్సిపాలిటీ వ్యవహారం అటకెక్కింది. ఒకప్పుడు పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం…. ఇప్పుడు కేవలం ఐదు మండలాలకు పరిమితమైంది. భద్రాచలం డివిజన్ మూడు మండలాలకు పరిమితమైంది. భద్రాచలం పేరు మీదుగా ఉన్న పార్లమెంట్ హోదా కూడా పోయింది. భద్రాచలం మండల పరిషత్ హోదా కూడా కోల్పోవడంతో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు కూడా నోచుకోకుండా పోయింది. ఇన్ని సమస్యలతో రాముడు నడయాడిన పుణ్య భూమి భద్రగిరి విలవిలలాడుతోంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న పుణ్యధామం భద్రగిరిని…. ఇకనైనా అన్ని హంగులతో తీర్చిదిద్దాలని భక్తజనులు కోరుతున్నారు…..