పాలేరు ఎమ్మెల్యే కందాల ఔదార్యం
*వెంటనే డబల్ బెడ్ రూమ్ లకు విద్యుత్ కాంతులతో నింపిన ఎమ్మెల్యే కందాల
== విజయం కథనానికి స్పందన
(పెండ్ర అంజయ్య, కూసుమంచి-విజయంన్యూస్);-
సమస్య ఉందంటే తక్షణమే స్పందించే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరోసారి అలాగే స్పందించారు. డబుల్ బెడ్ రూమ్ఇండ్ల లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా లేక తాగునీటి సమస్య జఠిలమవుతుందని, ఆ సమస్యను పరిష్కరించాలని బాధితులు కొంత మంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు శనివారం రాగా, వారు కార్యాలయం వద్ద వేచి ఉన్న పరిస్థితిని చూసి ‘విజయం’ దిన పత్రిక కథనాన్న ప్రచురితం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత బాధ్యులకు సమాచారం అందించింది. కాగా స్పందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ తన ఔదార్యాన్న చాటుకున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే నిర్ణయిం తీసుకున్నారు.
also read :-రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితునికి ఆర్థిక సాయం..
దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండల పరిధిలోని తురకగూడెం గ్రామానికి చెందిన డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు గత కొంత కాలంగా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా తాగునీటి సమస్య కూడా జఠిలంగానే ఉంది. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అనేక సార్లు సంబంధిత అధికారులకు వినతి చేశారు. ఆయన పనులు చేసినప్పటికి శాశ్వత పరిష్కారం కాలేదు. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఆ తరువాత కొద్ది రోజులకే తిరిగి సమస్య పునరావ్రుతం అయ్యింది. కాగా వేసవి కాలం కావడంతో తట్టుకోలేక లబ్దిదారులు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని కలిసేందుకు క్యాంఫ్ కార్యాలయంకు వచ్చారు.
also read :-ఖబర్దార్ గల్లా.. తప్పుడు ఆరోపణలు మానుకో
ఎమ్మెల్యే ఇతర కార్యక్రమాల నిమిత్తం బయటకు వెళ్లగా క్యాంఫ్ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. దీంతో విజయంపత్రికలో కథనం ప్రచురితం చేసింది. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వ్యక్తిగత అనురులు తక్షణమే వారితో మాట్లాడి, వారికి కావాల్సిన తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రాగా ఆయనకు వారు పడుతున్న గోస, ఆవేదనను విన్నవించుకున్నారు.
దీంతో చలించిపోయిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సొంత ఖర్చులతో నెల రోజుల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను తక్షణమే మరమత్తులు చేయించాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖాధికారులు అక్కడ మరమ్మతులు చేయించి గంటల వ్యవధిలో డబల్ బెడ్ రూమ్ వాసులకు వెలుగులు నింపారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యే కందాలకు కృతజ్ఞతలు తెలిపారు