Telugu News

పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

◆అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు.. పేదలకు లబ్ధిచేకూరేలా మళ్ళీ దరఖాస్తుకై ఏప్రిల్ 30వరకు గడువు పొడిగింపు

0

పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

◆అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు.. పేదలకు లబ్ధిచేకూరేలా మళ్ళీ దరఖాస్తుకై ఏప్రిల్ 30వరకు గడువు పొడిగింపు

◆దేవభక్తిని కిషోర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తో మంత్రి పువ్వాడకు స్వాగతం

◆8,14,15వ డివిజన్ పేదలకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పేదలకు లబ్ధిచేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన go no.58& 59 పథకం క్రింద దరఖాస్తు చేసుకుని మంజూరైన ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పంపిణీ చేశారు.శుక్రవారం ఖమ్మం నగరం LB నగర్ నందు పేదలకు Go. no.58 & 59 పథకం క్రింద 406 మందికి మంజూరైన ఇళ్ల పట్టాలు మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. 8వ డివిజన్ లో 253, 14వ డివిజన్ లో 122, 15వ డివిజన్ లో 23, Go.No 59 క్రింద 8 మొత్తం 406 పట్టాలు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో తిరంగా మార్చ్ నిరసన.. హాజరైన ఖమ్మం ఎంపీలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం Go.No.58 & 59 పథకం పేదలకు వరంలాంటిది అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా పేదలు నివాసం ఉంటున్న చోటే ఇంత పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చిన ప్రభుత్వంను చూసారా అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని మీ ఇంటి గడపకు అందిస్తున్నామని, ఇక్కడ ఉన్న ప్రతి పేద ఇల్లు నేడు ప్రభుత్వం పథకం అనుభవిస్తున్నారని అన్నారు.మిషన్ భాగీరధ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నామని అన్నారు. కనీసం త్రాగడానికి నీరు లేకుండా కిలోమీటర్ల నుండి నీరు తెచ్చుకునే పరిస్థితి నుండి నేడు మీ వద్దేకే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.పేదవాళ్ళు పట్ల BRS ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది కాబట్టే నేడు ఖమ్మం కార్పోరేషన్ వ్యాప్తంగా లక్షల విలువైన భూములను పేదలకు ఇస్తున్నామని, అట్టి ఇంటికి స్థలంకు పట్టాలు ఇచ్చామన్నారు.వివిధ కారణాలతో ఇంకా ధరఖాస్తు చేసుకొని వారు ఉంటే తక్షణమే ధరఖాస్తు చేసుకోవాలని, GO.no 58 &59 పథకాన్ని పొడిగించడం జరిగిందని ఏప్రిల్ 1వ తేదీ నుండి 30 వరకు దరఖాస్తు చేసుకొవొచ్చు అని సూచించారు. అర్హులైన వారు ఎంత మంది దరఖస్తు చేసుకున్నా అందరికీ ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి: అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి పువ్వాడ

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే అనేక పథకాలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని, మహిళల పేరుతోనే కళ్యాణలక్ష్మీ చెక్కులు, kcr కిట్స్, ఇళ్ళ పట్టలు, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.రానున్న రోజుల్లో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరుపున రూ.3లక్షలు కూడా ఇప్పిస్తామని హామి ఇచ్చారు.

◆అర్చ్ ప్రారంబించి, BRS జెండా ఎగురవేసిన మంత్రి పువ్వాడ

8వ డివిజన్ నందు నూతనంగా నిర్మించిన పువ్వాడ అజయ్ నగర్ పేరున నిర్మించిన ఆర్చ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. అనంతరం ఎర్పాటు చేసిన BRS పార్టీ దిమ్మె, పార్టీ జెండాను ఎగురవేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ,సుడా చైర్మన్ విజయ్ కుమార్,AMC చైర్మన్ శ్వేతా, RDO రవీంద్రనాథ్, కార్పొరేటర్ రావూరి కరుణ, కూరాకుల వలరాజ్,తహసీల్దార్ శైలజ, నాయకులు పగడాల నాగరాజు, RJC కృష్ణ, దేవబక్తుని కిషోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, గొల్లపూడి హరికృష్ణ, సురేష్, అశోక్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర