జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వానికి చవితి ప్రేమ
— ఉద్దేశపూర్వకంగానే కాలయాపన
— అన్ని జిల్లాల్లో లేని అనుమతులు ఖమ్మంలోనే ఎందుకు..?
— ముఖ్యమంత్రి హామీమేరకు జర్నలిస్టులందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
— ఈ నెల 30 లోపు అధికారిక స్పందన రాకుంటే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాల సమాయత్వంతో ఆందోళన చేపడతాం
— విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని, ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఇలాఖాలతో పాటు అన్ని జిల్లాల్లో లేని అనుమతులు ఖమ్మంలోనే ఎందుకనీ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రకారం వెంటనే జర్నలిస్టులందరికీ ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో తెలంగాణ రాకముందు హామీలు ఇచ్చారని, తెలంగాణ వచ్చినాక గత పది సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారే కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళన: విరహత్ అలీ
పాత్రికేయ సంఘాలు చాలా కాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఈ సమస్యను ప్రస్తావించామని, జర్నలిస్టుల సమస్యల కోసం జిల్లావ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని, సిపిఎం పార్టీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై ధర్నా చేసిన రోజే అనేక సంఘాలు సంఘీభావం తెలిపాయని అన్నారు .ప్రభుత్వం నుండి కూడా హామీ ఇచ్చారని, రెండు జర్నలిస్ట్ మహాసభల్లో పాల్గొన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి హామీ ఇచ్చారని, మూడు నెలల్లో సమస్య అయిపోతుందని అన్నారని తెలిపారు. ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భ సభ జరిగిందని, సభలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చామని, ఆ సభలో సీఎం మాట్లాడుతూ కోర్టులో ఆటంకాలు తొలిగిపోయాయని, జిల్లా కేంద్రంతో పాటు జిల్లా అంతట జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభలోనే మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు .పది నెలలు కావస్తున్నా ఇంకా కార్యచరణ దాల్చలేదని, మొదట 5 ఎకరాలు, తరువాత 23 ఎకరాలు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన ఆగిపోయాయని, అసలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉందని, ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఇళ్ల స్థలాలు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూస్తున్నారని తెలిపారు .ఎన్నికల సమయం దగ్గర పడిందని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు ఇచ్చినవారు, వాగ్దానం చేసిన వారు ఉంటారనే గ్యారెంటీ లేదని ,మళ్లీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు . మనసుంటే మార్గం ఉంటుందని, అనేక జిల్లాల్లో చాలాచోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు .ఆర్థిక మంత్రి హరీష్ రావు తన ఇలాఖాలో కూడా జర్నలిస్టులకు ఇల స్థలాలు ఇచ్చారని అన్నారు . అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అందుకనే ఉద్దేశపూర్వకంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పైకి మాటలు చెప్పినా.. జర్నలిస్టులందరికీ హామీ ఇచ్చిని, వాగ్దానం చేసి మభ్యపెడుతూనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు .చిత్తశుద్ధితో ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది అర్థమవుతుందని అన్నారు . ఎకరం భూమి రిజిస్ట్రేషన్ వేల్యూ రూ.5 లక్షల కంటే ఎక్కడా లేదని, బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ భూములు ఎకరానికి రూ.3 కోట్లు నుండి, 5 , 6 కోట్లు ఉందని, కానీ ఆ భూమి రిజిస్ట్రేషన్ వ్యాల్యూరూ. 4 లక్షలే ఉందన్నారు. అయినా ప్రభుత్వ భూమికి అంత వ్యాల్యూ ఏంటని.. కుంటి సాకులు తప్ప మరేమీ లేదన్నారు. వాస్తవానికి జర్నలిస్టులు తెల్ల కార్డు కలిగి, తక్కువ ఆదాయం ఉన్నవారు అని, నాలుగో తరగతి ఉద్యోగులతో కూడా వీరికి పోలిక లేదన్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా, కుంటి సాకులు చెప్పకుండా.. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులను ఆదుకోవాలనే ఆలోచన ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 30వ తేదీ లోపు అధికారిక స్పందన రాకుంటే సిపిఎం పార్టీ చొరవు తీసుకొని అన్ని రాజకీయ పార్టీల వారిని, ప్రజా సంఘాలను, జర్నలిస్టు సంఘాలను సమావేశపరిచి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై .విక్రమ్, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా: మంత్రి పువ్వాడ