పెద్దిపెల్లి గ్రామ ఆదివాసులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయం న్యూస్):-
పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం విజయనగరం పంచాయతీ పరిధిలో ఆదివాసి గ్రామం పెద్దిపెళ్లి గ్రామస్తులు గత 24 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు.. 2018 లో సింగరేణి యాజమాన్యం ఓసి విస్తీర్ణ కొరకు వారిని అక్కడి నుండి తరలించి వారి కుటుంబానికి ఆర్ ఎం ఆర్ ప్యాకేజీ కింద లక్షా 60 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. సింగరేణి సంస్థ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 5 లక్షల 50 వేల ఇవ్వకపోగా వారికి కనీస అవసరాలను కూడా తీర్చలేకపోయింది.
నాలుగేళ్లు గడుస్తున్నా పాఠశాల భవనం నిర్మించక పోవటం
సింగరేణి యాజమాన్యం పెద్దపెల్లి గ్రామస్తులకు నాలుగు లక్షల రూపాయలతో పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చినారు.నేటి వరకు ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఇప్పటికైనా పాఠశాల భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు సింగరేణి యాజమాన్యం ని కోరుతున్నారు.
ఆవాసలా ఏర్పాటు
also read;-జి టి ఎస్ ఎస్ ఎస్ వారి చేయూత..
అడవి తల్లి బిడ్డలైన ఆదివాసీ ప్రజలు మళ్లీ వారి గూడుని 2018 సంవత్సరంలో రామానుజవరం పరిధిలో నిర్మించుకున్నారు.కానీ వారిలో సగం మందికి పైగా రేషన్ కార్డులు లేక పోవడం వలన ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలు అందకుండా పోతున్నాయి.
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
అభివృద్ధిలో అందనంత వేగంగా దూసుకుపోతున్నామని జరుగుతున్న ప్రచారం ఆచరణలో ఎక్కడ కూడా కనిపించడం లేదు అనిపిస్తుంది.కొన్ని గ్రామాలకు అసలే విద్యుత్ సౌకర్యం లేదు.ప్రతీ ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు పర్యటించి కరెంటు విషయంలో హామీలు ఇస్తుండడం రివాజుగా మారిందే తప్ప ఇప్పటి వరకు వారి హామీలు అమలుకు నోచుకోలేదు.యేళ్ల నుంచి ఈ గ్రామంలో పూర్తిస్థాయి అంధకారంలోనే మగ్గుతున్నాయి.గ్రామా ప్రజలు రాత్రివేళల్లో భయం భయంగా గడుపుతున్నారు. మహిళలు, పసి పిల్లలు పొద్దుగూకిందంటే బయటకు వెళ్ళేందుకు జంకుతుంటారు. తమకు కరెంటు సౌకర్యం కల్పించాలని యేళ్ళ నుంచి కోరుతున్నప్పటికి ఫలితం కనిపించడం లేదని ఆ గ్రామస్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేని కారణంగా వీరు వెలుతురు కోసం నానా తిప్పలు పడుతున్నారు.
పినపాక యువజన కాంగ్రెస్ డిమాండ్
పెద్దపెల్లి గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఐదు లక్షల యాభై వేలు ఇవ్వాలని అంతేకాకుండా రేషన్ కార్డులు అందరికీ మంజూరు చేయాలని, వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ కేటాయించాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అలాగే నియోజకవర్గం లో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.లేనియెడల సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హెచ్చరించారు.