Telugu News

కమలం గూటి కి చేరిన హస్తం

కాషాయ కండువా కప్పుకున్న చెరుకూరి సతీస్ కుమార్

0

కమలం గూటి కి చేరిన హస్తం

 

—-కాషాయ కండువా కప్పుకున్న చెరుకూరి సతీస్ కుమార్

 

—-చెరుకూరి సతీస్ కుమార్ ను భద్రాచలం అసెంబ్లీకి పంపనున్న బిజెపి…?

 

—-వెంకటాపురంలో కాంగ్రెస్ ఖతం…❓

 

—-ఏజెన్సీ లో పుంజుకోనున్న కాషాయ కమల దళం

 

—యస్ టి నియోజకవర్గాల పై బీజేపీ ప్రత్యేక దృష్టి…❓

 

(నూగూరు వెంకటాపురం-విజయం న్యూస్)
వెంకటాపురం లో రాజకీయ సమీకరణాలు అతి వేగంగా మారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కాషాయ కమల దళం కసితో ముందుకు పోతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి జనసత్వాలు కల్పించే దిశగా అధిష్టాన పెద్దలు రాజకీయ వ్యూహం తో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగానే వెంకటాపురం లో కీలక నేతకు గాలం వేశారు.

also read;-గ్రామీణ వైద్యుల సమస్యకు త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం.. మంత్రి పువ్వాడ.

వెంకటాపురంమండలం లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తు ,ఆ మండలం లో ఎంపీపీ గా కొనసాగుతున్న చెరుకూరి సతీస్ కుమార్ ను కమలం గూటికి చేరారు. వెంకటాపురం మండలం లో కాంగ్రెస్ లో ప్రజా ఆదరణ కోల్పోయి పెద్ద దిక్కు లేకుండా నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో కీలక నేతలు పార్టీని వీడటం క్యాడర్ కు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.

also read;-గేదె ను ఢీకొట్టిన బస్సు13మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎంపిపి సతీస్ కుమార్ ను కాషాయం కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నుండి అసెంబ్లీ కి పంపే ఆలోచన లో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఏజెన్సీ లో కాషాయ కమల దళం అతి వేగంగా పట్టు కోసం పాకులాడుతుంది.ఇతర రాష్ట్రాలతో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగిరేసి ప్రస్తుతం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలో యస్ టి నియోజకవర్గ స్థాయిలోను ప్రత్యేక దృష్టి పెట్టి యస్ టి ఓట్లు రాబట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనీ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వెంకటాపురం లో యంపీపీ చెరుకూరి సతీస్ కుమార్ బీజేపీ కండువా కప్పుకోవడం తో వెంకటాపురం లో కాంగ్రెస్ ఖతం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.