ఖమ్మంలో రెండవ విడుత కంటి వెలుగు షురూ..
== ప్రారంభించిన నలుగురు సీఎంలు, జాతీయ నేతలు
== ఆదర్శం ఈ పథకమని చెప్పిన ముగ్గురు సీఎంలు
ఖమ్మం, జనవరి 1(విజయంన్యూస్):
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్ గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్, అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్, సీఎం కేసీఆర్, అఖిలేశ్ యాదవ్, డీ రాజా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు
.
ఇది కూడా చదవండి: ‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం
రాష్ట్రంలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేశారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు సిఫారస్ చేశారు. తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టింది. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్‌ను స్టాల్స్ వారీగా నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస గౌడ్, శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వీ, కమీషనర్ శ్వేతా మహంతి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీలు కేశవరావు,
ఇది కూడా చదవండి: చరిత్ర తిరగరాస్తున్న ‘ఖమ్మం కలెక్టరేట్’
నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాలోతు కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పొలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, మల్లు బట్టి విక్రమార్క, వనామా వెంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.