Telugu News

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్

0

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

◆ 14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్.

◆ నాటిన 9 వేల వివిధ రకాల మొక్కలకు తక్షణమే డ్రిప్ ఎర్పాటు చేయాలని ఆదేశం.

◆ పలు సూచనలు చేసిన మంత్రి పువ్వాడ.. పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం.

(విజయం న్యూస్);-

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

రఘునాధపాలెం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే 14 ఎకరాల ప్రభుత్వ భూమిని వెలికి తీసి మొత్తం రూ. 1.50 కోట్లతో అత్యద్భుతంగా నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం, ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనుల పురోగతిని పరిశీలించారు.

also read :-రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్

నిర్దేశించిన 10వేల మొక్కలలో భాగంగా ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మినోత్సవం సందర్భంగా మెగా హరితహరంలో భాగంగా ఒకే రోజు 5 వేల వివిధ రకాల మొక్కలు నాటడం జరిగిందన్నారు.

మొత్తం ఇప్పటి వరకు 9వేల మొక్కలు నాటడం జరిగిందని అధికారులు వివరించారు. మిగతా మొక్కలు కుడా తక్షణమే నాటాలని ఆదేశించారు.

ప్రజలకు ఉపయోగపడే జామ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, నేరేడు, పారిజాతం, కరివేప, తదితర మొక్కలను నాటినందున ప్రతిమొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.అందుకు ప్రతి మొక్కకు నీరు అందేవిధంగా డ్రిప్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

also read :-ఫారెస్ట్ అధికారులు ఆదివాసి పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం

బండ్ చుట్టూ కొనసాగుతున్న బయోఫెన్సింగ్‌ పనులను పరిశీలించారు. దానిని అనుకుని పక్కనే మొక్కలు వేయాలన్నారు. మెయిన్‌గేట్‌, వాకింగ్‌ట్రాక్‌, ఆట స్థలం నిర్దేశిత స్థలంలో ఆట వస్తువులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలని, ఓపెన్ జిమ్ ప్రాంతాలను గుర్తించి వాటికి అమర్చాలన్నారు.

బండ్ లోపలకు వెళ్లేందుకు ఎర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనులు పరిశీలించారు. బండ్ లోకి నీరు వచ్చే విధంగా అందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించి బండ్ లోకి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నిర్మాణ పనుల వేగం పెంచాలని, నిత్యం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.

కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈఓ అప్పారావు, DRDA PD విద్యాచందన, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, పంచాయతి రాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ, MRO నర్సింహరావు తదితరులు ఉన్నారు.

 

please subscribe this chanel smiling chaithu;-