Telugu News

జిల్లా ఖ్యాతిని చాటిన ఇంటర్ విద్యార్థులకు మంత్రి అభినందన

990 మార్కులతో రోహిణీ(బైపీసీ) రాష్ట్రంలోనే ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ స్థానం

0

జిల్లా ఖ్యాతిని చాటిన ఇంటర్ విద్యార్థులకు మంత్రి అభినందన

 == ఎంపీసీలో నిఖిల్, బైపీసీలో రోహిణీ..

==  990 మార్కులతో రోహిణీ(బైపీసీ) రాష్ట్రంలోనే ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ స్థానం

== విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంట‌ర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఖమ్మం జిల్లా విద్యార్థులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. మంగళవారం ప్రకటించిన ఇంట‌ర్ రెండవ సంవ‌త్స‌రం పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఖమ్మం నగరం పాకబండ బజార్ కు చెందిన ఏఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని   990మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను తొలి స్థానంలో నిలిపిందన్నారు. ఖమ్మం జిల్లా బొనకల్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల కు చెందిన నిఖిల్(ఎంపీసీ) 984, ఖమ్మం నగరం పాకబండ బజార్ కు చెందిన ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని రోహిణి(బైపీసీ) 990 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ స్థానం లో నిలవడం గర్వకారణమన్నారు.

ఇది కూడా చదవండి: అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు – మంత్రి పువ్వాడ

ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ రోహిణీ ని  ప్ర‌త్యేకంగా అభినందించారు.  ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభను కనబర్చడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గురువులు చెప్పిన విషయాలను అనుసరించి సమయాన్ని వృధా చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తారని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నిరూపించారని  అన్నారు. ఖమ్మం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర‌ స్థాయిలోచాటిన  విద్యార్థులను, ఉత్త‌మ విద్యార్థుల‌కు తీర్చిదిద్దేందుకు ఆహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని, ప్రోత్స‌హిస్తున్న విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌త్యేకంగా అభినందించారు. విద్యార్ధులు కృషితో, పట్టుదలతో ఉన్నతమైన విజయాలను సాధిస్తూ కన్న తల్లిదండ్రులకు, పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి: ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పువ్వాడ

గ‌తంలో ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా ను అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిన జిల్లాగా పిలిచేవార‌ని.. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత  అన్ని రంగాల్లో దూసుకుపోతుంద‌ని ముఖ్యంగా విద్యా రంగంలో  ఈ ప్రాంత విద్యార్థులు త‌మ స‌త్తా చాటుతున్నార‌ని తెలిపారు.   ఇంట‌ర్ విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకోడం వ‌ల్లే  ఈసారి గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని పేర్కోన్నారు.