ఖమ్మంలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఖమ్మం మరింత అభివద్ది కోసం ప్రయత్నం చేస్తాం : మంత్రి
ఖమ్మంలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
== ఖమ్మం మరింత అభివద్ది కావాలి.. ప్రజలందరు సహాకరించాలి
ఖమ్మం, నవంబర్ 26(విజయంన్యూస్):
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 46వ డివిజన్ లో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో రూ. 30 కోట్లతో 42 కి.మీ. మేర క్రొత్త సిసి డ్రెయిన్స్ నిర్మాణం చేపట్టామన్నారు. 2 వెజ్, నాన్ వెజ్ ఆధునిక మార్కెట్లు, అల్లిపురం, కాల్వ ఒడ్డు, ప్రకాష్ నగర్, బల్లెపల్లి వద్ద వైకుంఠదామాలను ఏర్పాటుచేసుకున్నట్లు ఆయన
అన్నారు. గోళ్లపాడు ఛానల్ క్రింద 11 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ డ్రయినేజి చేపట్టి, మురికికూపాలుగా ఉన్న ప్రాంతాల్లో పార్కులు నిర్మాణం చేసి సుందరీకరణ పనులు చేశామన్నారు. జూబ్లీక్లబ్ పార్క్ అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయని, త్వరలో ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరంగా ఖమ్మం రూపుదిద్దుకున్నదని మంత్రి అన్నారు. రూ. 300 కోట్లు మంచినీటి కోసం ఖర్చు చేసిన కార్పొరేషన్ ఖమ్మం అని, కార్పొరేషన్లలో ఎక్కువ లబ్ది పొందిన కార్పొరేషన్ ఖమ్మం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మానవ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉంది..మంత్రి పువ్వాడ