Telugu News

దివ్యాంగురాలికి అండగా మంత్రి పువ్వాడ

ఏం చేశారంటే..?

0

దివ్యాంగురాలికి అండగా నిలిచిన మంత్రి పువ్వాడ

== ట్రై సైకిల్ ను మంజూరు చేసి అందించిన మంత్రి పువ్వాడ

== మంత్రి పువ్వాడ అజయ్ కి  రుణపడి ఉంటాను: దివ్యాంగురాలు నష్విత

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

దివ్యాంగులు అంటేనే దైనందిన జీవితావసరాలకు ఇతరులపై ఆధారపడేవారు. మరొకరి సాయం లేకుండా ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనివారు. అలాంటివారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అపారమైన ఆత్మవిశ్వాసంతోపాటు అత్యాధునిక ఉపకరణాలు, ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి నవజీవనానికి నాందిపలుకుతున్నారు. సర్కారు అందిస్తున్న భరోసాతో దివ్యాంగులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం నగరానికి చెందిన ఓ దివ్యాంగురాలికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలిచారు.

ఇది కూడా చదవండి: తెలుగు సిని పరిశ్రమలో విషాదం..కైకాల ఇకా సెలవు

ఖమ్మం నగరానికి చెందిన దివ్యాంగురాలు నష్విత ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడి, క్షణక్షణం నరకయాతన పడుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి ఆమెకి ఆసరాగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆమెకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంజూరు చేసి ఆమెకు అందించారు. ట్రై సైకిల్ తో పాటు ఒక నాణ్యతతో కూడిన హెల్మెట్‌, చార్జర్‌ను మంత్రి ఆమెకు అందించారు.

మంత్రి పువ్వాడ అజయ్ గారికి రుణపడి ఉంటాను: దివ్యాంగురాలు నష్విత

”దివ్యాంగులకు అన్ని రకాల తోడ్పాటుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న కృషి అభినందనీయం. నాకు వారు చేసిన సహాయం ఇది చాలా గొప్ప విషయం వారికి సదా రుణపడి ఉంట. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ట్రై స్కూటీలను ఇవ్వాలని కోరుకుంటున్న.”- దివ్యాంగురాలు నష్విత