Telugu News

ప్రజలందరు బాగుండాలని పూజలుచేసిన మంత్రి

పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి పువ్వాడ.

0

ప్రజలందరు బాగుండాలని పూజలుచేసిన మంత్రి

== పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి పువ్వాడ.

== కాబోయే నూతన వధూవరుల ఆశీర్వదించిన మంత్రి దంపతులు.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో జరిగిన పలు శుభకార్యాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఖమ్మంలోని ఫంక్షన్ హాల్ నందు మాదినేని నర్సింహరావు కుమార్తె వరుణ్య-రాము ల నిశ్చయ తాంబూలనికి హాజరై కాబోయే నూతన వధూవరుల ఆశీర్వదించారు. ఖమ్మం గోపాలపురం నందు బండారుపల్లి వెంకటేశ్వర్లు కుమార్తె విద్య- గోపి ల నిశ్చయ తాంబూలనికి హాజరై కాబోయే నూతన వధూవరుల ఆశీర్వదించారు. ఖమ్మం దొరేపల్లి ఫంక్షన్ హాల్ నందు నూతలపాటి సుధాకర్ రావు కుమార్తె ప్రత్యూష-హర్ష వర్ధన్ ల నిశ్చయ తాంబూలనికి హాజరై కాబోయే నూతన వధూవరుల ఆశీర్వదించారు.

ALLSO READ- ఎమ్మెల్యే సండ్ర ఇళ్లు పాయే

గోపాల్ పురం లోని మామిడి తోటలో గొల్లపూడి రాంప్రసాద్ కుటుంబం చేపట్టిన ఉప్పలమ్మ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నారు. అలాగే ఖమ్మం నగరం 10వ డివిజన్ నందు శ్రీ ఆంజేయస్వామి విగ్రహ శంకుస్థాపన కు ముఖ్య అతిథిగా హాజరై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విగ్రహ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందర్ని దేవదేవుళ్లు చల్లగా చూడాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. ఆ దేవదేవుళ్ల దయతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరాన్ని, ఖమ్మం జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ప్రజలందరు సహాకరించాలని కోరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఖమ్మం నగరంలో జరిగే అభివద్ది పై ప్రశంసలు కురిపించిన సంగతి మనందరికి తెలిసిందేనని, ఆయన ఆశీర్వాదంతో సుందరనగరంగా వీరాజిల్లుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.

ALLSO READ- నందిగామలో మంత్రి పువ్వాడ పర్యటన