Telugu News

జీవం విడిచిన వానరం ఉన్నత అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

మూడురోజులు అయినా తొలగించని వానర దేహం

0

జీవం విడిచిన వానరం ఉన్నత అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
మూడురోజులు అయినా తొలగించని వానర దేహం
మండలంలొ విద్యుత్ అధికారుల తీరు మారదా ?
నిర్లక్ష్య ధోరణికి చరమగీతం ఎప్పుడు

(గార్ల-విజయం న్యూస్)

గార్ల మండల కేంద్రంలో విద్యుత్ ఉన్నత అధికారుల తీరు మారడం లేదు మండల పరిపాలకులు ప్రజల కష్టాలను విస్మరించిన మూగ జీవులను కూడా విస్మరిస్తారా అన్న ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తు తున్నాయి. గత మూడు రోజుల క్రితం వానర జీవి గార్ల మసీదు సెంటర్ లొ ఉన్న కరెంట్ తీగల మీద ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. మూడు రోజులు అయినా ప్రజలు పిర్యాదులు చేసిన వాటిని తొలిగించే నాథులు కరువయ్యారని వాపోతున్నారు.

మండలం లొ సుమారు 5సంవత్సరాలుగా
ఇదే నిర్లక్షపు ధోరణిని అవలింబిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ గార్ల మండలానికి మాత్రం మినహాంచారా అన్న పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఉన్నతాధికారుల వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే పధకాలు అభాసు పాలు అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, పై ఉన్నత అధికారులు స్పందించి ఇటువంటి నిర్లక్షపు అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

also read :- మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన.. భారీగా మోహరించిన బలగాలు