Telugu News

తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మాదే: భట్టి విక్రమార్క

వార్ రూమ్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్య రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి 

0

తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మాదే: భట్టి విక్రమార్క

== 78స్థానాలు పక్కా వస్తాయి

== వార్ రూమ్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్య రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి 

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ గాంధీభవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో అభయ హస్తం తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ను ఏఐసిసి జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే తో కలిసి ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క  మాట్లాడారు.

ఇది కూడా చదవండి:- జోస్యం చెప్పిన నామ..ఏమన్నరంటే..?

*సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్*

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు హామీలను కచ్చితంగా అమలు చేస్తాం.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తాం.

500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తాం.

ఇది కూడా చదవండి:- విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం.
మద్దతు ధరపై అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాం

ఇందిరమ్మ ఇల్లు:
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తాం

యువ వికాసం
అద్భుతమైన సమాజ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ లోతైన ఆలోచన చేసి విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు గ్యారెంటీ ఇస్తున్నాం

ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. యువ వికాసంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం

ఇది కూడా చదవండి:- హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

15 ఎకరాలకు తగ్గకుండా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పిస్తాం

చేయూత పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 4000 రూపాయల పింఛన్ ఇస్తాం

బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సగం మందికి పింఛన్లు కోత విధించి సగం మందికి ఇవ్వడం సామాజిక బాధ్యత కాదు

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పిస్తాం

కొందరు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్స్ అమలు చేయరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్, హైదరాబాద్ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషన్ అన్నీ కూడా అమలు చేస్తాం. అవి మేనిఫెస్టో లో పెడతాం. కానీ ఈ 6 గ్యారంటీ లు 100 రోజుల్లో అమలు పరుస్తాం…

ఇది కూడా చదవండి:-;ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: భట్టి

కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వచ్చి ఇచ్చేటువంటి గ్యారెంటీ కార్డులను ప్రతి ఒక్కరూ ఈ కార్డును జాగ్రత్తగా మూడు నెలలు దాచుకోండి.

కాంగ్రెస్ అధికారంలోకి మీకు ఇచ్చిన గ్యారెంటీ కార్డు తీసుకువచ్చి మీ హామీలను నెరవేర్చుకోండి.

ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన అపారమైన అనుభవం, బడ్జెట్ పై అవగాహన, ఆలోచన, మేధో సంపత్తి కలిగిన కాంగ్రెస్ నాయకత్వానికి వీటిని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తెలుసు. ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే గ్యారెంటీ కార్డులు ప్రకటన చేసాం.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కర్ణాటకలో అమలు చేశాం. తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే అమలు చేస్తాం.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎదో అంటున్నాడు కాంగ్రెస్ నాయకులు మాటలు నమ్మి ఆగం కాకండి అని అంటున్నారు. మీరు ఆగం కాకండి.

*ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత నలుగురికి వోల్వో బస్సు కానీ, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. మాతోపాటు కర్ణాటకకు రండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలవుతున్నాయా లేదా చూసి వద్దామని సవాల్ చేశారు.*

ఇది కూడా చదవండి:- రోజంతా పంచుడే..పంచుడు..వామ్మో ఎన్ని పైసలో..?

*బిఆర్ఎస్ పాలకులు ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పేజీ, లక్ష ఎకరాలకు సాగునీరు, మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. మీలాగా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు.*

*ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు బిజెపికి ఉపయోగపడేలా ఉన్నాయి*.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లౌకికవాది, దేశ నాయకుడు. ఈ దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప నాయకులు. అలాంటి గొప్ప లౌకికవాది అయిన రాహుల్ గాంధీ పై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేయడం ఆయన ఆలోచన ఎట్లా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.