Telugu News

అసెంబ్లీలో ఒకే ఒక్కడు 

ప్రజల పక్షంగా గొంతు వినిపిస్తున్న ఆ నాయకుడు

0

అసెంబ్లీలో ఒకే ఒక్కడు 

== భట్టి వర్సెస్ మంత్రులు

== అధికారపార్టీ పై  ప్రశ్నల వర్షం

== ప్రజల పక్షంగా గొంతు వినిపిస్తున్న భట్టి విక్రమార్క

== మూకుమ్ముడిగా మంత్రివర్గం కౌంటర్ టూ ఎన్ కౌంటర్

== అసెంబ్లీలో షేబాస్ అనిపించుకున్న సీఎల్పీనేత

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ అసెంబ్లీ.. మొత్తం 119 మంది సభ్యులు.. బీజేపీకి ముగ్గురు, ఎంఐఎంకు 7గురు, అధికార బీఆర్ఎస్ పార్టీ కి 104 మంది ఎమ్మెల్యేలు.. అందులో సీఎంతో పాటు 18 మంది మంత్రులు.. అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యే.. అందులో ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చింది నలుగురు.. సీతక్క  ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు.. అడపాదడప శ్రీదర్ రెడ్డి ప్రశ్నిస్తున్నప్పటికి సీఎల్పీ నేత మాత్రం ‘ఒకే ఒక్కడు’ గా మిగిలారు.. ప్రతిపక్షహోదా కూడా లేదు.. ఆ హోదాను ఎంఐఎం పొందినప్పటికి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఒక్కడే . ఆయన 104 మంది ఎమ్మెల్యేలకు సవాల్ చేస్తూ, ప్రశ్నలను సందిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..

ఇది కూడా చదవండి: కేసీఆర్ మాటలను నమ్మొద్దు : రేవంత్

రోడ్లు, రవాణా, నీటిపారుదల, ఐటీ, కార్మిక, విద్యా, వైద్యం ఇలా అనేక శాఖలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ ఏం చేయలేదంటున్న అధికార పార్టీ మంత్రులకు సమాధానమిస్తూనే గతంలో ఏం చేశారో, ఇప్పటి ప్రభుత్వం  ఏం చేసిందో..? ఏం చేస్తుందో సూటిగా ప్రశ్నించడంతో అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి మంత్రులు భట్టికి కౌంటర్ టూ ఎన్ కౌంటర్ చేస్తూ షెటేర్లు వేస్తూ అందర్ని అసెంబ్లీ వైపు తిప్పుకున్నే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, అధికార పక్షం అద్భుతంగా షెటేర్లు వేస్తూ, ప్రశ్నలకు సమాధానమిస్తూ రాజకీయంగా కాకుండా అసెంబ్లీని ఈ విధంగా నడిపించాలంటూ నిరూపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

గత కొద్ది రోజులుగా అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. అందులో మొదటి రెండు రోజుల పాటు బడ్జెట్  పై గవర్నర్ ప్రసంగం, ఆ తరువాత ధన్యవాదాలపై సమావేశం జరిగింది. అనంతరం రెండు రోజులుగా పద్దులపై చర్చ జరుగుతోంది.. ఒన్ సైడ్ వార్ అవుతుంది తెలంగాణ అసెంబ్లీలో అని అందరు ఊహించి ఉంటారు.. కానీ అక్కడ మాత్రం అందుకు భిన్నంగా అసెంబ్లీ నడుస్తోంది.. అసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఒకేఒక్కడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.. దానికి ప్రభుత్వ మంత్రులు సమాధానాలిస్తూనే షెటేర్లను సందించారు.. దీంతో అసెంబ్లీ అసక్తికరంగా మారింది.

== అన్ని శాఖలపై ప్రశ్నల వర్షం

అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఒక్క శాఖ కాదు. అనేక శాఖలకు చెందిన ప్రశ్నలు సంధిస్తూ మంత్రులను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజలకు ఏం చేసిందో..? తెలంగాణకు ఏం ప్రాజెక్టులను నిర్మాణం చేసిందో చెబుతూనే మరో పక్క తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదో..? నిధులేందుకు ఇవ్వలేదో మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అసెంబ్లీలో కనిపిస్తోంది. కాళ్లేశ్వరంపై, సీతారామాప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్ ఇలా అనేక పెద్ద, చిన్న తరహాప్రాజెక్టులపై ప్రశ్నల వర్షం కురిపించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో పక్క విద్యా, వైద్యంపై కూడా మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ మాఫీయాపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇది కూడా చదవండి : అసెంబ్లీలో భట్టి ప్రశ్నల వర్షం

ప్రైవేట్ మాఫీయాకు ప్రభుత్వానికి సంబంధం ఉందన్నట్లుగానే ఆరోపణలు చేస్తూనే ప్రైవేట్ మాఫీయాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఖమ్మం జిల్లాలో వైద్యం పరిస్థితి, ఆయన స్వంత నియోజకవర్గంలో వైద్యం పరిస్థితిపై ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీష్ రావు సమాధానం ఇస్తూనే ఆయన భట్టి పై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లో పోటోలతో సహా అభివద్దిని చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావిస్తే సీఎల్పీనేత భట్టి విక్రమార్క అందుకు భిన్నంగా మాట్లాడుతూ మంత్రివర్గానికి షాక్ నిచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ను అభివద్ది చేసిందేవ్వరో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీకన్వర్షన్ ఇలాంటి పోటోలో కూడా చూపిస్తే బాగుండు అంటూ మంత్రి కేటీఆర్ కు షెటేర్లను వేస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక నీటిపారుదల విషయంలో ప్రభుత్వంపై ద్వజమెత్తితే, అందుకు తగ్గట్లుగా మంత్రులు భట్టిపై తిరగబడ్డారు. ప్రశ్నలతో భట్టిని మాట్లాకుండ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికి భట్టిదే పైచెయ్యి అయ్యిందనే చెప్పాలి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై, అక్రమ అరెస్టులపై భట్టి దాడి చేశారనే చెప్పాలి. దీంతో మంత్రులు మధ్యలోనే కల్పించుకుంటుడంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక రకమైన వాధనతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వంలో వందమంది ఉండోచ్చు, ప్రతిపక్షంగా ఒక్కడే ఉండోచ్చు..కానీ ప్రతిపక్షం గొంతు వినిపించకుండా నొక్కేస్తే ప్రజాస్వామ్యమంటారా..? అంటూ మైక్ అపినప్పుడళ్లా స్పీకర్ పై మండిపడుతున్న తీరు చూడముచ్చటగొలిపింది.

== జర్నలిస్టులకు అండగా భట్టి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని 2014లో ఎన్నికలంటే ముందు చెప్పిన సీఎం కేసీఆర్, ఇప్పటి వరకు ఇండ్ల ప్లాట్లు ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వడం లేదంటే సుఫ్రీంకోర్టులో కేసు ఉంది అందుకే ఇవ్వడం లేదని చెప్పరని, కానీ ఇప్పుడు కోర్టు క్లీయరెన్స్ ఇచ్చింది కదా…ఎందుకు ఇవ్వడం లేదని మంత్రులను ప్రశ్నించారు. బిల్లులు ఆగిపోయి సర్పంచుల ఆత్మహత్యలు, పోలీసులకు పదోన్నతలు, ఉపాధ్యాయుల ఆందోళనలు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన, వీఆర్ఏ ల సమస్య పరిష్కారం, గ్రామీణ వైద్యుల సమస్యలు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు సందించారు. 24గంటల విద్యుత్, రైతుల కష్టాలు, అదనపు చార్జీల పేరుతో దోపిడి ఇలాంటి అన్నటిపై ప్రశ్నలసందించిన భట్టి విక్రమార్క ప్రతిపక్ష పార్టీ నాయకుడి పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో భట్టి అన్న, భట్టి గారు అంటూ మంత్రులు చెబుతుంటే ఆశ్ఛర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీలో బీఆర్ఎస్ దే వన్ సైడ్ వార్ అనుకున్న తరుణంలో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నలతో భట్టి వర్సెస్ మంత్రులు అన్నట్లుగా మారిపోయింది. ఎక్కడా ఇతర తప్పుడు మాటలు, తప్పుడు లాంగ్వేజీ లేకుండా చాలా హుందాగా నడిసింది తెలంగాణ అసెంబ్లీ.. అంతే కాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ‘వన్ ఆఫ్ ది విక్రమార్కుడిగా’ మారిపోయారు.