కేసీఆర్ ను గద్దే దించుడే ఏకైక లక్ష్యం: పొంగులేటి
== ఆ సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉంది
== అందుకే జులై 2న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం
==3లక్షల మందితో ఖమ్మంలో బహిరంగ సభ పెడుతున్నాం
==ఆ సభతో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది
== నాకు పదవులు ముఖ్యంగా కాదు
== కాంగ్రెస్ కు అధికారం కోసం నాలుగు అడుగులు వెనక్కి వేస్తా
== అందరితో కలిసి పనిచేస్తా.. కేసీఆర్ సర్కార్ ను కుప్పకూల్చేస్తాం
== అధికారాన్ని తీసుకొచ్చే బాధ్యతను తన బుజాలపై వేసుకుంటా
== విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
== కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది : జూపల్లి
(న్యూఢిల్లీ/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణలో సీఎం కేసీఆర్ ను, బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గ్దదె దించుండే ఏకైక లక్ష్యమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే మేమంతా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. పదవులు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ నుంచి బయటకు రాలేదని.. పదవులు నాకు కొత్తేం కాదున్నారు. వైఎస్ఆర్ సీపీ నాకు బిక్ష పెట్టిన పార్టీ అని, ఆ పార్టీ నుంచి నేను ఎంపీగా, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచామనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటిలో చేరిన శీనన్న
అయినా తనకు పదవులు ముఖ్యం కాదని.. పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని.. పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు వివరించారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని తెలిపారు. ఇక కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. బీజేపీ పరిస్థితి కేంద్రంలో, రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని, మాటల గారడి, మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తులు అని చెప్పుకొచ్చారు. మూడోసారి మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. కానీ ఆయన వల్ల కానే కాదన్నారు. తెలంగాణ బిడ్డలు కోరుకున్నది మాత్రం ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారని పొంగులేటి వెల్లడించారు. తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అర్థమైందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర అందర్ని మేలుకోల్పిందన్నారు. ఆ పాదయాత్రతో రాహుల్ గాంధీ మరింతగా గ్రాఫ్ పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించామని, ప్రాంతీయ పార్టీ పెట్టడం కంటే ఏదో పార్టీలో చేరాలని మేధావులు సూచించారన్నారు. కర్నాటక విజయంతో కాంగ్రెస్ మరింత పుంజుకుందని, తెలంగాణలో బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, సిఎం కెసిఆర్‌ను గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సిఎం కెసిఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని, గారడీలు చేయడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు అని పేర్కొన్నారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకున్న తరువాత రాహుల్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని, ఎపిలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చారని, మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కెసిఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని, ఆరు నెలల విశ్లేషణ తరువాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని, కొంతకాలంగా తాను, జూపల్లి కృష్ణా రావు అనేక చోట్ల ఆత్మీయ భేటీలు నిర్వహించామన్నారు. కొంతకాలంగా తాను తెలంగాణలోని పరిస్థితులపై సర్వేలు చేయించామన్నారు. ఎన్నిసార్లు సర్వే చేయించిన రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సర్వేలు వస్తున్నాయని తెలిపారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులతో కలిసిపనిచేస్తానని అన్నారు. మాకు వర్గాలు ఉండవని, అందరు సమానంగానే చూస్తమన్నారు.
== జులై2న పార్టీలో చేరతాం: పొంగులేటి
జూలై 2 ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. సుమారు 3లక్షల మందితో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు గ్రామీణ స్థాయి నుంచి జన సమీకరణ జరుగుతుందన్నారు. ఖమ్మం బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని, ఖమ్మం నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభించేందుకు జులై 2న ముహుర్తాన్ని ఖరారు చేశామన్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి
ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావుఠాక్రే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుయాష్కిగౌడ్, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నుంచి డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వావిజయ్ బాబు, మహిళా కార్పోరేషన్ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, భద్రాచలం బీఆర్ఎస్ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావ్, ఉద్యమకారుడు, ఎస్సీకార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, అశ్వరరావుపేట బీఆర్ఎస్ ఇంచార్జ్ జారే అధినారాయణ, బానోతు విజయబాయి, కార్పోరేషన్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బీరోలు సోసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, మధిర నాయకులు కోట రాంబాబు, ఉక్కంటి గోపాల్ రావు, డాక్టర్ రాజా రమేష్, జూపల్లి రమేష్, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, హనుమందల ఝాశ్ని రెడ్డి, రఘనాథయాదవ్, రాఘవేంద్రరెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు హాజరైయ్యారు.