Telugu News

రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం : శివకుమార్

%% నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వ నమోదు. ప్రారంభం

0

రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం : శివకుమార్
%% నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వ నమోదు. ప్రారంభం
%% సభ్యత్వ నమోదును ప్రారంభించిన పీసీసీ కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు, నగర కమిటీ అధ్యక్షుడు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరిస్తున్నాయని, వ్యవసాయాన్నే నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతున్నాయని పీసీసీ కార్యదర్శి శివకుమార్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ జావిద్ అన్నారు. బుధవారం ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ.జావిద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శివ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

also read :-ప్రమాదవశాత్తు బైకు దగ్ధం.

ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్నో సంక్షేమాభివద్ధి పథకాలను తీసుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలందరికి నమ్మకమైన నాయకత్వమని, ప్రజలందరకి భరోసా కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రస్తుతం పాలిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నడిబజారులో నట్టెట అమ్మె విధంగా వ్యవహారిస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో, పనుల పేరుతో కోట్ల కుంబకోణం చేస్తూ కుటుంబాలకు పదవులను ఇస్తూ మీకోసమే మేమంటూ నటిస్తూ పరిపాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి నమ్మకద్రోహ పార్టీలు, ప్రభుత్వాలను ప్రజలు చీదరించుకునే సమయం రానే వచ్చిందని, రాబోయే రోజుల్లో కర్రుకాచి వాతపట్టె పరిస్థితి వస్తుందన్నారు.

%% కాంగ్రెస్ లో సభ్యత్వ తీసుకోవడం అదృష్టం
భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన టువంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవటం అదృష్టమని శివకుమార్ అన్నారు. ప్రతి ఒక్కరు, ప్రజలందరు సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల రైతు, ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరు కాంగ్రెస్ పార్టీని అదరించేందుకు సిద్దంగా ఉన్నారని, సభ్యత్వం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. అందుకే ఎనరోల్ మెంట్ చేసే వారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్పకుండా ప్రతి ఒక్కర్ని కలిసి సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. రాబోయే సంక్రాంతి పండుగ వరకు ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని బూతులు సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మహమ్మద్ జావేద్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, మ్యాన్యువల్ గా జరిగేది. కానీ ఈ సారి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారని తెలిపారు.

also read :-ఆస్ట్రేలియా లో లక్షెట్టిపెట్ యువకుడు మృతి

ప్రస్తుతం సభ్యత్వం తీసుకునే వాళ్లందరి వివరాల్ని ఆన్లైన్ లో నమోదు చేస్తారని తెలిపారు.అందరి వివరాలు ఏఐసీసీ, టీపీసీసీకి అనుసంధానమై ఉంటాయని తెలిపారుసభ్యత్వ నమోదు చేయించుకున్నటువంటి ప్రతి సభ్యునికి ఇన్సూరెన్స్ చెందేటట్లు గా ఈసారి సభ్యత్వం ఏర్పాటు చేయనుందని, కావున ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన, ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందిన ప్రమాద భీమా వర్తిస్తుందని, ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుందనీ చెప్పారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్లో అధ్యక్షులతో పాటు అన్ని విభాగాల అధ్యక్షులు ఖమ్మం నగర కార్పొరేటర్లు దుద్దుకూరు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్ ,నిరంజన్, పల్లె బోయిన చంద్రం, కొప్పెర ఉపేందర్, మహమ్మద్ రఫీదా ముస్తఫా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య, రఘునాధపాలెం మండల బాధ్యులు దీపా నాయక్, బాలాజీ నాయక్, దుప్పటి నగేష్, కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు