Telugu News

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

సర్పంచ్ కు న్యాయం జరిగే వరకూ పోరాటం

0

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

సర్పంచ్ కు న్యాయం జరిగే వరకూ పోరాటం.

(ఏన్కూరు విజయం న్యూస్):-

ఏన్కూరు మండలం జన్నారం గ్రామ సర్పంచ్ పద్మ కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సంజీవ్ నాయక్ అన్నారు. సోమవారం వారు ఏన్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గిరిజన మహిళా సర్పంచ్ పై దాడికి పాల్పడిన హరికృష్ణ మరికొంతమందిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పై తరచూ దాడులు జరుగుతున్నాయని,గిరిజనులపై ఆధిపత్యపోరు ప్రదర్శిస్తున్నారని ఇలాంటి పద్ధతులను మానుకోవాలని హెచ్చరించారు. గిరిజనులను అడ్డం పెట్టుకొని గిరిజనుల పైనే దాడి చేయిస్తున్నారని గిరిజనుల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

also read :-అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అంబేద్కర్ అడుగుజాడల్లో, శాంతి మూర్తి సేవాలాల్ మార్గంలో తాము నడుస్తున్నా మని గిరిజనులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ సంఘటనపై ఏ సీ పీ ని, మానవ హక్కుల కమిషన్ను, ఎస్సీ ఎస్టీ కమీషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సర్పంచ్ పద్మకు న్యాయం జరగకపోతే ఏన్కూర్ ప్రధాన సెంటర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు .గిరిజన మహిళా సర్పంచ్ పై జరిగిన దాడి ఘటనపై జిల్లా మంత్రి స్పందించాలని కోరారు. తొలుత సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు జన్నారం గ్రామానికి వెళ్లి సర్పంచ్ పద్మను పరామర్శించారు దాడి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ పద్మ, నెహ్రూ నాయక్, నరేష్ జాదవ్, సుశీల భాయ్, అనిత బాయ్, నాగమణి బాయ్, మాన్ సింగ్ నాయక్, మత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.