Telugu News

==ఖమ్మంలో కాంగ్రెస్ నేతల ఆందోళన.. సీపీ ఆపీస్ ముట్టడికి యత్నం

నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

0

==ఖమ్మంలో కాంగ్రెస్ నేతల ఆందోళన.. సీపీ ఆపీస్ ముట్టడికి యత్నం
== నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
== పలు చోట్ల హౌజ్ అరెస్ట్..
== కాంగ్రెస్ నేతల అరెస్ట్ అక్రమం .. అప్రజాస్వామికం
== కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గప్రసాద్
===(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):-
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాక్యాలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమండ్ చేస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు మేరకు బుధవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేశారు. ఖమ్మం సీపీ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీ కార్యాలయంకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు.

also read :-ఖమ్మంరూరల్ మారేమ్మగుడిలో టీఆర్ఎస్ యువజన విభాగం పూజలు

దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ లతో పాటు అనుబంధ సంఘాల నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. కాగా మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పోరేటర్ ఇద్దరు ఖమ్మం టూటౌన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. మహిళ పోలీసులు లేకపోవడంతో వారిని అరెస్టు చేసే అవకాశం రాలేదు. దీంతో వారిద్దరు ర్యాలీగా పర్యటిస్తండటంతో కొంత అసక్తి రేపింది. ఆ తరువాత మహిళా పోలీస్ లతో వారిని అరెస్టు చేసి మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

also read :-గుండాల లో బంద్ విజయవంతం
== కాంగ్రెస్ నేతల అరెస్టు హాస్యస్పదం
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తీవ్రంగా ఖoడించారు. అస్సాం సీఎం ను వెంటనే భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సాం సీఎం వ్యాక్యాలను తీవ్రంగా ఖండించిన ఆయన దేశ సంస్కృతికి విరుద్దంగా వ్యాఖ్యలకు చేసిన బిజెపి ముఖ్యమంత్రి శర్మ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అస్సాం సీఎం పై ద్వజమెత్తినప్పుడు ఆయనపై కేసు నమోదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు.

also read :-==తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదానం

కచ్చితంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు దొందుదొందే అని అన్నారు. అస్సాంసీఎం పై కేసు నమోదు చేసి, ఆయన్ను తక్షణమే పాలన నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. . శర్మ వ్యాఖ్యాలకు దేశ ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పైన ఇలాంటి వ్యాక్యాలు చేయడం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శర్మకు తగదని అతని పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేనా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరని, ఇదేనా బిజెపి నేతల సంస్కృతి, సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు తిలక్. రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం చేసిన వ్యాక్యాలకు భవిష్యత్తులో బిజేపి భారీ మూల్యం చెల్లించుకుంటుందని తిలక్ హెచ్చరించారు.

ఇకనైనా బిజెపి నేతలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారాదని, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
== సీపీ కార్యాలయాన్ని ముట్టండిచేందుకు యత్నించి అరెస్టైన నేతలు
రాయల నాగేశ్వరరావు నాయకత్వంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఖమ్మం పోలీస్ కమీషనరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కాగా వారిని చూసిన త్రీటౌన్ పోలీసులు వారిని అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ లు బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ నేతలు ఉపేందర్, శ్రీను లను ఇంటి వద్దే అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని తిలక్ నిరసన వ్యక్తం చేశారు.

also read :-ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి​ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, ఖమ్మం రూరల్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సీనియర్ నాయకులు కాంగ్రెస్ షేక్ హుస్సేన్, పెండ్ర అంజయ్య, పల్లెబోయిన భారతి , కార్పొరేటర్ ధారమల్ల భాస్కర్, వడ్డే నారాయణరావు, కన్నేటి వెంకన్న,దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పొదిల హరినాద్ ను కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు నాయక్ ,ఏలూరి రవి కుమార్,బండి నాగేశ్వరరావు,సుదర్శన్, మండల కాంగ్రెస్ నాగండ్ల శ్రీనివాసరావు,భోజడ్ల సత్యనారాయణ, బచ్చలకూరి నాగరాజు, మాజీ సర్పంచ్ మద్ది వీరారెడ్డి, ,బాణాల లక్ష్మన్, యువజన కాంగ్రెస్ నగర నాయకులు, బి.శంకర్ నాయక్, బాణాల లక్ష్మణ్,భూక్యా బాలాజీ,యువజన కాంగ్రెస్ నాయకులు అన్వేష్ గౌడ్,జిల్లా సోషల్ మీడియా ఓసీ ఆర్డినేటర్ యాసిన్, తదితరులు హాజరైయ్యారు.