జై కాంగ్రెస్ నినాదంతో దద్దరిల్లిన పొంగులేటి శిబిరం
అతి కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోనే నా నిర్ణయం ప్రకటిస్తా
జై కాంగ్రెస్ నినాదంతో దద్దరిల్లిన పొంగులేటి శిబిరం
== అభిమానుల అభీష్టమే ఫైనల్
== అతి కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోనే నా నిర్ణయం ప్రకటిస్తా
== మారిన తన వ్యూహంతో ఇప్పుడు వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నశ్రీనన్న
== ఖమ్మంలో ప్రధాన అనుచరులతో ముగిసిన శ్రీనివాస్ రెడ్డి భేటీ
== బీఆర్ఎస్ కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని కామెంట్
== ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటన
ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పొంగులేటి శిబిరం హాట్ టాఫిక్ గా మారింది.. ఆయన క్యాంఫ్ కార్యలయంలోముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా, పొంగులేటి మైక్ పట్టగానే కరెంట్ కట్ చేశారని, పేదలకు నినాదాలతో మారుమోగాయి.
ఇది కూడా చదవండి:- వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
ప్రతి ఒక్కరు జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలతో దద్దరేళ్లేలా మొత్తుకున్నారు. దీంతో సమావేశం హాల్ ఒక్కసారిగా కాంగ్రెస్ మీటింగ్ తరహగా మారింది. ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఎస్ఆర్ కన్వష్ణ ఖమ్మంలో తన ప్రధాన అనుచరులతో సమావేశం అయ్యారు. జై కాంగ్రెస్ జై ,జై శీనన్న నినాదాలతో సమావేశం హాల్ దద్దరిల్లింది . ఆయన కూడా తన అనుచరులకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇండికేషన్ ఇచ్చారు . 20 మందికి పైగా మాట్లాడారు .మాట్లాడిన వారంతా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు కురిపించారు . ఆయన ఖమ్మంలోనే పోటీ చేయాలనీ రఘునాథ పాలెం మండలం నుంచి వచ్చిన వారు కోరడం గమనార్హం. పొంగులేని ఏ పార్టీ లో చేరతారనేదాని దాదాపు తెరదించారు . ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్లు చెప్పారు . రెండు మూడు రోజుల్లోనే హైద్రాబాద్ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు తమ నిర్ణయాన్ని చేసి వెల్లడిస్తామని పొంగులేటి స్వయంగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి:- పొంగులేటి సంచలన నిర్ణయం
శుక్రవారం ఖమ్మంలోని ఫంక్షన్ హాల్ లో తన ప్రధాన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉద్యేగభరితమైన ప్రసంగం చేశారు . తనను గేలి చేసిన వాళ్ళు , చిన్న చూపు చూసినవాళ్లు ఉన్నారని ,కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగారని అయినప్పటికీ అన్నిటిని చిరునవ్వుతోనే స్వీకరించానని అన్నారు . ప్రజాభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని అభిమానుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . అన్న ఎప్పడు నిర్ణయమని ఇంకా ఎప్పడు ఎన్ని రోజులు అని అనేక మంది తనను అడిగారాని వారందరికీ త్వరలోనే అధికారికంగా శుభవార్త చెపుతామని అన్నారు . కొందరు తాను తీసుకొనే నిర్ణయం తప్పుడుదైతే ఇబ్బందులు ఉంటాయని జాగ్రత్తలు చెప్పారు . లక్షలాది మంది గుండె చప్పుడును అర్థం చేసుకున్నాను . వారు నడవమన్న బాటలో తప్పకుండ నడుస్తాను .మరికొన్ని రోజుల్లో నోట్లో స్వీట్ పెట్టబోతున్నాను …మీ శీనన్న మీ ఆకాంక్షలమేరకే నడుస్తాడు అని గుర్తుంచుకోండి … జై శీనన్న అనే నినాదాల మధ్య చెప్పారు.
ఇది కూడా చదవండి:- మీరుండగా వాళ్లు నన్నేం పీకలేరు..: మంత్రి పువ్వాడ
నా నిర్ణయం కొంత ఆలశ్యం అవుతుందని ఆందోళ చెందినవారు ఉన్నారు . అనేక మంది తన శ్రేయస్సు కోరి అనేక సలహాలు ఇచ్చారు…సూచనలు చేశారు .వారందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు . సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. తనను నమ్ముకున్న అనుచరులు చెప్పినట్టే చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. తాను ఓ పార్టీలో చేరుతానని ఊహించిన బీఆర్ఎస్ స్థానిక నేతలు మందు పార్టీలు, పండుగ చేసుకున్నారని అన్నారు. కానీ, మారిన తన వ్యూహంతో వారికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదన్నారు. తమది సుదీర్ఘ రాజకీయ చరిత్ర అన్నారు . వ్యక్తగత విమర్శలు చేశారు . అన్ని తమ మదిలో ఉన్నాయని వాటిని వడ్డీతో సహా చెల్లించే రోజులు ఎంతో దూరంలో లేవని గుర్తుంచుకోవాలనిచురకలు అంటించారు.
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై తాను యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతోందన్నారు.తండ్రిలా భావించి పార్టీలో చేరితే కేసీఆర్ చేసిన అవమానాలు అన్ని విన్నీ కావని అయినప్పటికి అన్ని భరించి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు . 2019 లోకసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వక పొగ ,తర్వాత ఇస్తానన్న రాజ్యసభ కూడా ఇవ్వలేదని వాపోయారు. కనీసం కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఇది కూడా చదవండి:- ఏసీబీకి చిక్కిన ఏన్కూరు తాసిల్దార్
రాబోయే కురుక్షేత్రంలో తనను తట్టుకోలేమని, ఎన్నికల్లో మళ్లీ ప్రజా ప్రతినిధులు కాలేమని వారికీ భయం పట్టుకుందని అన్నారు . తండ్రిలా భావించిన కేసీఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నోసార్లు అవమానించినా ఓర్చుకొని, సహనంతో ఉన్నానని చెప్పారు. ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్నిఒక్క పాతర కాదు రెండు పాతర్ లంతగా గొయ్యితీసి పెడతామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి:- కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రధాన అనుచరులు హాజరైయ్యారు . తర్వాత తన నివాసంలో వివిధ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమైన పొంగులేటి హైద్రాబాద్ వెళ్లి పోయారు ..