Telugu News

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ క్రీడలలో యువకుల సత్తా.

వారంతా గిరిపుత్రులు తమకు నచ్చిన క్రీడలో స్వతహాగా మెళుకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.

0

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ క్రీడలలో యువకుల సత్తా.

(గార్ల-విజయం న్యూస్):-

వారంతా గిరిపుత్రులు తమకు నచ్చిన క్రీడలో స్వతహాగా మెళుకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ఫ్లోర్ బాల్ లో ప్రతిభ చాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వివరాల్లోకి వెళితే.

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ క్రీడలలో గార్ల మండలం పరిధిలోని పెద్ద కృష్టాపురం గ్రామపంచాయతీ అంజనాపురం గ్రామానికి చెందిన యువకులు మహబూబాబాద్ జిల్లా తరఫున పోటీపడి రాష్ట్రస్థాయిలో జిల్లాను మూడవ స్థానంలో నిలిపి తమ సత్తా చాటారు. గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ క్రీడలు నిర్వహించడం జరిగిందని .జిల్లా ఫ్లోర్ బాల్ కోచ్ భానోతు మోతిలాల్ తెలిపారు .ఈ క్రీడా పోటీలలో రాష్ట్రస్థాయిలో 21 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారని జూనియర్ సీనియర్ లెవెల్ లో మహబూబాబాద్ జిల్లా జట్టు తరఫున అంజనాపురం గ్రామానికి చెందిన యువ క్రీడాకారులు ఏ రామ్ కుమార్ జీ సాయి కుమార్ బీ సంతోష్ లు పాల్గొని 13 జట్టులతో హోరాహోరీగా పోటీపడి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా పేరును స్థిర స్థాయిలో నిలిపారు.

కొంతమంది జూనియర్ క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగిందని వివరాలను నిర్వాహకులు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. ఫ్లోర్ బాల్ క్రీడలలో జిల్లా తరపున ఆడి గార్ల మండలం అంజనాపురం గ్రామం పేరును రాష్ట్రంలో నిలిపినందుకు గార్ల బయ్యారం సిఐ తిరుపతి ఎస్సై బాదావత్ రవి నాయక్ ఎంపీపీ మూడు శివాజీ చౌహాన్ జెడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి గార్ల పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

also read :-షాకింగ్ న్యూస్ : మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చరిత్రను బయటపెట్టిన రేవంత్ రెడ్డి.