Telugu News

భారతదేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ: గుగులోతు శంకర్

రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తో సాద్యం

0

భారతదేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ: గుగులోతు శంకర్
—–రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తో సాద్యం
—— ఆర్టిఐ మాజీ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్
(కారేపల్లి-విజయం న్యూస్):

భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అని రాజ్యాంగ పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ తోనే సాద్యం అవుతుందని
సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను ఆర్టిఐ మాజీ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్ కోరారు. ఈ మేరకు సింగరేణి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఆర్టిఐ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ

ఇది కూడా చదవండి:- రేపు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక…!

బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో బడుగు బలహీన ఎస్టి,ఎస్సి, బిసి,హరిజన గిరిజనులకు ఒరిగింది ఏమీ లేదని పేద, వెనకబడిన వర్గాల ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.హస్తం గుర్తు – పేదోళ్లకు నేస్తం అందుకోసమే మే 13 వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గాబరా గాబరా కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీ నీ ప్రధానమంత్రి చేసుకొని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందనితెలిపారు. కావున మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం ప్రమాదం లో ఉంది రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తీసేస్తామని మాటల్ని పటాపంచలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో భాగ్య స్వాములుకావాలన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి,చేతి గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శంకర్ నాయక్ కోరారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నాయకత్వంలోనే మరింత అభివృద్ధి అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగరేణి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాశ్, జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు సురేందర్ మునియార్, గుగులోత్ భీముడు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, హనీఫ్, ఓయూ నాయకులు ప్రవీణ్ కుమార్ ,ఎం.అనిల్ కుమార్, రాజశేఖర్ యాదవ్, రంజిత్ సింగ్ ,బి.సురేష్ తుదితరులు పాల్గొన్నారు.