Telugu News

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి.

ఏన్కూరు విజయం న్యూస్

0

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి.

( ఏన్కూరు విజయం న్యూస్):-

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్ర నాయక్ కోరారు. శుక్రవారం మండల పరిధిలోని శ్రీరాంపురం తండ, మరసకుంట చెరువుల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు .కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వేసవి తీవ్రత దృష్ట్యా సౌకర్యాలు కల్పించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల రాములు, గిరిజన సంఘం నాయకుడు భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు.