పిట్ట కొంచెం…. కూత ఘనం..,
ఐదు సంవత్సరాల చిన్నారికి నంది అవార్డు……
(చండ్రుగొండ-విజయం న్యూస్ ):-
అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని కళానిలయంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో చండ్రుగొండ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల దాసరి విన్సి నంది అవార్డు అందుకోని పలువురి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళితే చండ్రుగొండ మండలానికి చెందిన దాసరి నాగేశ్వరరావు, మేరిరాణి, దంపతుల కుమార్తె దాసరి విన్సి, నిర్మల్ లోని వాసవి కిడ్స్ పాఠశాలలో యూకేజి చదువుతుంది. చిన్నారి తండ్రి నిర్మల్ పట్టణంలో వాసవి ఒలింపియాడ్ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా చండ్రుగొండ నుంచి వెళ్ళి నిర్మల్ లో స్థిరపడ్డారు. చిన్నారికి టీవీలో వచ్చే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకోవడంతో వారి తల్లిదండ్రులు కూడా చిన్నారిని ప్రోత్సహించి నృత్యం నేర్పించారు. పాఠశాల సిబ్బంది కూడా చిన్నారిని ప్రోత్సహించి నృత్యంలో మెళకువలు నేర్పారు.
also read :-పంటల పోషణకు సేంద్రియ పదార్థం అవసరం
చిన్నారి విన్సి పాఠశాలలో ప్రదర్శిస్తున్న నృత్యానికి ఆకర్షితులైన సాంస్కృతిక విభాగం వారు అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలో చిన్నారికి హైదరాబాదులోని కళాభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఈ నృత్య ప్రదర్శనలో అందరికంటే అత్యంత చిన్న వయసు అయినా విన్సి, తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకొని మొదటి బహుమతి అందుకుంది. అలాగే నంది పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది. ఈ బహుమతిని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల చారి, ఎస్పీ భారతి, చేతుల మీదుగా బహుమతి అందుకుంది. తమ పాఠశాల విద్యార్థిని విన్సికి నంది అవార్డు రావడంపై స్కూల్ కరస్పాండెంట్ జగదీశ్ రెడ్డి, ఉపాధ్యాయులు, చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు. చండ్రుగొండ మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పలు ప్రజా సంఘాలు చిన్నారి విన్సిని ప్రత్యేకంగా అభినందించారు. ఐదు సంవత్సరాల వయసులోనే నంది అవార్డు పొందడం అందులో మా ప్రాంతానికి చెందిన చిన్నారి కావడం అభినందించదగ్గ విషయం అన్నారు. చండ్రుగొండ గ్రామంలో ఉన్న నాన్నమ్మ తాత రాఘవులు లక్ష్మి, పెదనాన్న రామారావు, మణి దంపతులు హర్షం వ్యక్తం చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు.