సమాచార హక్కు చట్ట పేదలకు ఆయుదమే: శంకర్ నాయక్
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్


మొదటి అప్పిలేట్ అథారిటి ఉంది, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి జాప్యాన్ని తొలగించి, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పౌరులకు సమాచారం అందచేయడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమీషన్ చర్యలు చేపడుతుందన్నారు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమీషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. సమాచార హక్కుచట్టంపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సర్వినియోగ పరుచుకోవాలన్నారు.కళాశాల ప్రిన్సిపల్ డా॥మహ్మద్ జాకిరుల్లా, అధ్యాపకులు బి. వెంకటేశ్వరరావు, రత్న ప్రసాద్, డా॥జాన్ మిల్టన్, సీతారాం, గోపి, రమేష్, నాగూరు, సత్యవతి, విద్యార్థులు తదితరులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.