Telugu News

గులాబీ నేత కుటిలత్వం

భూ ధర పెంపుకే కార్యాలయం కేటాయింపు స్థలంపై పట్టుదల

0

 గులాబీ నేత కుటిలత్వం

== భూ ధర పెంపుకే కార్యాలయం కేటాయింపు స్థలంపై పట్టుదల

== పాలకవర్గం తీర్మానంపై కొందరితో కుటిల నాటకం

==హైడ్రామా లో ఉప సర్పంచ్ భర్తపై ఆరోపణలు

==తక్కువ సమయంలో కోట్లకు పడగ లెత్తిన వైనం

==అంబేడ్కర్ జంక్షన్ లో అరకోటితో భవనం కొనుగోలు

==పార్టీకి మచ్చ తెస్తున్న గ్రామల్లో పెత్తందారులు

==ఆస్తులపై అవనీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయనున్న కొందరు వ్యక్తులు

ఇది కూడా చదవండి:- నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

కుబేరుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి కాదు. తాత ముత్తాతలు కూడగట్టిన ఆస్తులు లేవు. సాధారణ కుటుంబంలో సామాన్య జీవితం గడిపిన వ్యక్తి. అధికార పార్టీ పంచన చేరాడు.చూస్తూ వుండగానే ఆస్తులను పెంచుకున్నాడు. పార్టీ అండతో ప్రజలకు దర్శన మిచ్చేలా స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తూ,గ్రామ ప్రజలపై పెత్తనం చెలాయించడం ప్రారంభించాడు. నూతన గ్రామ పంచాయితీ కార్యాలయం భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయంలో కొందరిని మచ్చిక చేసుకుని ఆధిపత్యం చేస్తున్నాడని గ్రామస్తుల ఆరోపణలు ఉన్నాయి. పాలక వర్గానికి, ప్రజలకు, నేతతో పాటు మరికొందరు చేస్తున్న సవాళ్లు వర్ణనాతీతంగా మారాయి. అతగాడికి గ్రామంలోని ప్రధమ పౌరుడితో పాటు కొందరు నేతలు కూడా సహకరిస్తున్న అంశంపై ‘విజయం’ దిన పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం.

(నూగురు వెంకటాపురం-విజయం న్యూస్):

తెలంగాణ సర్కార్ పాలన సౌలభ్యం కోసం కొన్ని నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే బెస్తగూడెం కూడా ఏర్పాటయింది. పంచాయతీ కార్యాలయం నిర్మించుటకు రూ. 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. స్థలం కేటాయింపులో అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ నేత అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్వలాభం కోసం తాను కొనుగోలు చేసిన భూమి ప్రక్కనే నిర్మించాలని కల కన్నాడు. ఆ కలను నెరవేర్చుకునేందుకు మరికొందరిని మచ్చిక చేసుకుని గ్రామస్తులందరు వ్యతిరేకించిన స్థలంలోనే భవన నిర్మాణం చేపట్టాలని పట్టుపట్టాడు.

ఇది కూడా చదవండి:- ప్రభుత్వం తొందరగా స్పందించి ఉంటే నష్టం జరిగేది కాదు:సీతక్క

అతడికి సహకరించే వారికి, మరికొంత మంది ఆవారా గాళ్ళకు మద్యాన్ని, నగదును ముట్ట చెప్పినట్టుగా సమాచారం. గ్రామంలోని కొందరు ప్రజలు ఆందోళన చేపట్టడంతో అధికారులు స్పందించి వివాదాలు తలెత్తకుండా స్థలం కేటాయింపు జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్ కు సూచించారు. అధికార మత్తులో ఉన్న నేత కథ రివర్స్ తిరగడంతో మెజారిటీ ప్రజలు తనకే మద్దతు పలుకుతారనే భావనతో గ్రామసభకు శ్రీకారం చుట్టాడు. పంచాయతీ పరిధిలో స్వయాన సర్పంచే గ్రామసభ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశాడు. ప్రజల నాడిని గమనించిన ఆ నేత గ్రామ సభను కూడా రద్దు చేయించి పాలకవర్గం తీర్మానంతో పంతం నెగ్గాలనుకున్నాడు. సర్పంచ్ చేతనే వార్డు సభ్యులందరూ అతగాడికి అండగా నిలిచేలా నాటకాన్ని తెరకెక్కించాడు. విషయం గ్రహించిన సభ్యులు సమావేశంలో వారి కుట్రను తిప్పి కొట్టారు. ఎప్పటికైనా చెడుపై మంచి నెగ్గుతుందన్న నానుడి మాట గడిచిన బుధవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ తీర్మానంతో నిజమైంది.
తన కుటిల నాటకానికి అంతటితో పుల్ స్టాప్ పెట్టకుండా అనుచర గణం బహిరంగం సవాళ్లు విసురుతున్నట్లు గ్రామంలోని కొందరు వాపోతున్నారు. ఆ వ్యక్తికి పాలన వ్యవహారాల్లో అంతటి ప్రాధాన్యత లభించడానికి కారణం, అతడు కేవలం పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు. ఉప సర్పంచ్ భర్త, అందువల్ల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నప్పటికీ కార్యదర్శి, సర్పంచ్ మౌనం వహిస్తున్నట్లు తెలుస్తుంది.

== పాలకవర్గం తీర్మానంపై మరో కుట్ర :

అతగాడు కోరుకున్నట్లుగానే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కానీ అతడి ఆలోచనలకు భిన్నంగా, ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా సభ్యులందరూ తీర్మానం చేశారు. అయినా ఆశను చంపుకోలేక పార్టీ పెద్దలను ఆశ్రయించి అధికారాన్ని ప్రయోగించి మండల అధికారుల చేత మమ అనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారో? తిరస్కరిస్తారో? తెలియాల్సి ఉంది.

== అతడికి అన్ని పైసలు ఎక్కడివి:

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎటువంటి వ్యాపారాలు, వ్యవసాయం చేయకుండా కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు ఎంతోకాలంగా వస్తున్నాయి. చాలామంది కేవలం అవి ఆరోపణలనే అనుకున్నారు. కొంతకాలం క్రితం వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 50 లక్షలు విలువ చేసి భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మతులు చేయించు తుండడంతో ఆ ఆరోపణలు నిజమనే భావన జనంలో వస్తుంది. గ్రామంలో ఆరా తీయగా నిధి నిక్షేపాల నా జరిపి సంపాదించిన సొమ్ముగా చెప్ప కొస్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోనే కాకుండా ఏటూరునాగారం, భద్రాచలం వంటి ప్రాంతాలలో స్థిరాస్తులు కొనుగోలు జరిపినట్లుగా పలువురు చెబుతున్నారు.
అతడు సంపాదించిన అక్రమ ఆస్తులపై గ్రామంలోని కొందరు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ధనం ఉందని, పార్టీలో పెద్దల అండ ఉందని, గ్రామాల్లో పెత్తనం చెలాయించే ఇలాంటి వ్యక్తుల కారణంగా పార్టీకి నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సర్వేలు అధికార పార్టీ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ వి పిట్టల దొర కథలు: పొంగులేటి

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పై గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభావం తక్కువనే చెప్పాలి. అలాంటిది ఇలాంటి నాయకుల వల్ల అప్రయోజనమే ఎక్కువ చేకూరుతుంది.
గ్రామాల్లో ప్రజలకు వ్యతిరేకులుగా ఉంటున్న ఇసుమంటి నాయకులకు మండలంలోని పెద్దలు అండగా నిలిచి పార్టీకి నష్టాన్ని మూట కడతారా? మందలించి దారిలో పెడతారా? వేచి చూడాల్సిందే.