Telugu News

పంచాయితీ ట్రాక్టర్‌ను అమ్మకానికి పెట్టిన సర్పంచ్

ఆ పని చేయలేకనే ఈ పరిస్థితంటున్న సర్పంచ్

0

పంచాయితీ ట్రాక్టర్‌ను అమ్మకానికి పెట్టిన సర్పంచ్

== ఈఎంఐలు కట్టలేకనే  ఈ పరిస్థితి

== ప్రకటించిన సర్పంచ్‌

రాజన్న సిరిసిల్ల,డిసెంబర్‌7(విజయంన్యూస్):

ఒక వైపు నిధులు రావు.. వచ్చిన అరకొర నిధులు కూడా నీటిపన్నులు, విద్యుత్ పన్నులు చెల్లించేటందుకే సరిపోతున్నయి.. అరకొర పైసలుంటే లీకులేసుడు.. మొక్కలకు నీళ్లు పోసుడే సరిపోతుంది.. ఇంకేమున్నది పంచాయతీలా..? బూడిద తప్ప.. మొక్కలకు నీళ్లు పోసేటందుకు, చెత్తను తీసుకపోయేందుకు సీఎం కేసీఆర్ ట్రాక్టర్ ఇచ్చిండు.. పంచాయతీ పైసలు కట్టాలని చెప్పిండ్రూ.. ఇప్పుడు పంచాయతీలో పైసలు లేవు.. బ్యాంకోళ్లు మస్తుసార్లు పోన్లు చేస్తుండ్రూ..మరేమి చేయాలే.. అందుకే పంచాయతీ ట్రాక్టర్ నే అమ్మకానికి పెట్టిన అంటూ ఓ సర్పంచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.   ఈఎంఐలు కట్టలేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ను సర్పంచ్‌ అమ్మకానికి పెట్టారు.

ఇది కూడా చదవండ్రీ : డిసెంబర్ 15 నాటికి  ‘రైతుబంధు’: సీఎం కేసీఆర్

గత కొన్ని  నెలలుగా  ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కిస్తీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని  సర్పంచ్‌ రాధ చెబుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కువానిప్లలెలో ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలలుగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని సర్పంచ్‌ రాధ తెలిపారు. నెలనెలా ఠంచనుగా ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బందిపడుతున్నామని.. గత్యంతరం లేకనే సోషల్‌ విూడియాలో అమ్మకానికి పెట్టామన్నారు.  డబ్బులు కట్టలేకనే అమ్మకానికి పెడుతున్నట్లు సోషల్‌ విూడియాలో పెట్టామని చెప్పారు.   ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని సర్పంచ్‌ రాధ కోరారు