బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటే: రాహుల్
దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేసులుంటాయి..కానీ కేసీఆర్, అసదుద్దీన్ పై కేసులుండవ్
బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటే: రాహుల్
== దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేసులుంటాయి..కానీ కేసీఆర్, అసదుద్దీన్ పై కేసులుండవ్
(హైదరాబాద్ –విజయంన్యూస్)
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటేనని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తుక్కగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కొట్లాడటం లేదని, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం లపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నామని అన్నారు. వేరువేరు పార్టీలుగా కనిపిస్తాయే.. కానీ ఆ మూడు పార్టీలు ఆత్మ ఒక్కటేనని స్పష్టం చేశారు. నేను పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను, పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికారని తెలిపారు. నరేంద్ర మోడీ వెంట బీఆర్ఎస్ ఎంపీలు నడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన జీఎస్టీ బిల్లు విషయంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: రాహుల్
ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు గా నిలబడతున్నారని స్పష్టం చేశారు. అంతే కాదు ఈ రోజు హైదరాబాద్ లో జరిగే మన మీటింగ్ ను ముగ్గురికి ముగ్గురు ఆ మూడు పార్టీలు మీటింగ్ పెట్టుకున్నారని, మనల్ని డిస్టబ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. ఏ శక్తి కాంగ్రెస్ ను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది..కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇంకో విషయం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతిపక్షాల నాయకులపై ఏదో ఒక కేసు ఉందని, ఈడీ, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ ఇలాంటి అనేక శాఖలతో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టించారని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒక్క కేసు లేదు. ఎంఐఎం నాయకులపై ఎలాంటి కేసులేవని ఆరోపించారు. కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసు పెట్టారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏఐఎం పార్టీ అదినేత అసదుద్దిన్ పై కేసులు లేకపోవడానికి గల కారణలేంటో తెలుసా..? అని ప్రశ్నించారు. వారిద్దరు బీజేపీ పార్టీ తానుపార్టీలు, తందాన పార్టీలు కాబట్టి వారిపై కేసులు లేవని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే..?: రాహుల్ గాంధీ