Telugu News

వృద్ధురాలి మెడలో చైను దొంగలించిన దుండగులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

0
వృద్ధురాలి మెడలో చైన్ దొంగలించిన దుండగులు
== పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
అశ్వాపురం, జనవరి 24, (విజయం న్యూస్)
మండలంలోని మొండికుంట గ్రామంలోని బొడ్రాయి బజార్ లో సోమవారం రాత్రి తునికేసి లక్ష్మమ్మ (60) వృద్ధురాలు మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారు. లక్ష్మమ్మ తమ బంంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వృద్ధురాలు  నడుచుకుంటూ తన ఇంటికి వెళుతుండగా బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు వెనుక నుంచి వెళ్లి మూడు  తులాల నర బంగారపు చైన్ లాక్కెళ్ళారు. ఆ విషయం తెలుసుకొని వెంటనే సంఘటనానికి ఎస్సై లు జితేందర్,  నాగుల్ మీరా, చేరుకొని కేసు దర్యాప్తు చేయడం జరిగింది.