Telugu News

ఈదుల ను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…!

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న

0

ఈదుల ను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…!

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న

(మహబూబాబాద్- విజయం న్యూస్)

గీతా కార్మికులకు జీవనోపాధి అయిన 155 ఈత చెట్లను జెసిబి సహాయంతో తొలగించిన రాపాక వీరన్న రాపాక మోహన్ రెడ్డి లను వెంటనే అరెస్టు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపెల్లి గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికుల తో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ల లో ఈత చెట్లను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసు వారు ఏఎస్ఐ రమేష్ ని విచారణ పంపగా ధ్వంసమైన ఈ చెట్లను పరిశీలించి ఈత చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గౌని వెంకన్న మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు అన్నం పెట్టే 155 ఈత చెట్లను జెసిపి ద్వారా తొలగించడం అన్యాయమని జెసిపి ని సీజ్ చేసి గీత కార్మికులకు నష్టపరిహారం అందించాలని అన్నారు. గీత కార్మికులకు బ్రతుకు తెరువు కల్పించే ఈత చెట్లను అహంకార ధోరణి తో తొలగించడం వారి పరాకాష్టకు నిదర్శనమని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వ్యక్తులని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

also read :- ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన నక్సల్స్

also read :-ఖమ్మం నగరంలో మంత్రి విస్తృత పర్యటన

ఈ నిరసన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కోల యాదగిరి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు సూదగాని నరేష్,గౌడ పెద్ద మనిషి బత్తిని నరసయ్య, వీరన్న, ఐలయ్య, సతీష్, లింగమూర్తి, శ్రీనివాస్ మల్లయ్య వీరన్న సుధాకర్ శ్రీనివాస్, వెంకన్న, రాజు, వినయ్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.