Telugu News

టిఆర్ఎస్ నాయకుని పైపులైను కాల్చిన దుండగులు…….

రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్ధులు....

0

టిఆర్ఎస్ నాయకుని పైపులైను కాల్చిన దుండగులు…….
రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్ధులు….
(చండ్రుగొండ – విజయం న్యూస్ )

టిఆర్ఎస్ నాయకుని ఎదుగుదలను ఓర్చుకోలేని ప్రత్యర్థి నాయకుని పంట పొలం బోరు బావి నీటి కోసం తీసుకు వచ్చిన పైపులైను కాల్చిన ఘటన ఆదివారంలో మండలంలో చోటుచేసుకుంది.

బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… మండల పరిధిలోని తుంగారం గ్రామానికి చెందిన రైతు, టిఆర్ఎస్ నాయకుడు పసుపులేటి వెంకటేశ్వర్లు తనకు గల వ్యవసాయ బోరు మోటర్ నీటిని పొలం కు మళ్ళించేందుకు రు.40 రేల కర్చు పెట్టి కొనుగోలు చేసి తీసుకు వచ్చిన గోదావరి పైపును( గుర్తుతెలియని వ్యక్తులు ) నిప్పు అంటించడం తో పూర్తిగా కాలిపోయింది.

పొలం కి వెళ్లిన వెంకటేశ్వర్లు కాలిపోతున్న పైపు ని చూసి, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తాను గానుగపాడు సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన నాటినుండి సుమారు రెండేళ్లుగా కొందరు కావాలనే కక్షగట్టి పైపు ని కాల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు….

 

also read :- తీన్మార్ మల్లన్నపై ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు

also read :-రైతులతో రచ్చబండను విజయవంతం చేయండి – మొక్క శేఖర్ గౌడ్