Telugu News

తుమ్మల చేరికకు ముహుర్తం ఖరారు

అదే రోజు షర్మిళ  చేరిక.. పార్టీ విలీనం

0

తుమ్మల చేరికకు ముహుర్తం ఖరారు

== అదే రోజు షర్మిళ  చేరిక.. పార్టీ విలీనం

== భారీ జనసమీకరణతో రాజదానికి తుమ్మల..?

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖారారైనట్లే కనిపిస్తోంది.. దాదాపుగా తేది ఖారారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.. అదే రోజున స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ఆర్ టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ కూడా పార్టీలో చేరనున్నారు.  ఈ మేరకు ఆమె స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ని విలీనం చేసే అవకాశం ఉంది. అందుకు గాను ఆ ఇద్దరు నేతలకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది.. అంతే కాకుండా అదే రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.. భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులు అదే రోజు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది..ఈ విషయంపై తెలంగాణ పీసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు పార్టీలో చేరతారు.. ఎవరేవరు చేరతారనే విషయంపై విజయంప్రతినిధి అందించే ప్రత్యేక కథనంమీ కోసం..

మిగిలిన భాగం రేపు ఉదయం 8గంటలకు