సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి
== బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేందుకు ప్రయత్నాలు
== ఏ నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ను కూల్చేసే నిర్ణయం తీసుకుంటాం
== నేను ఒక్కడ్నే కాదు.. నా కుటుంబం ఇదంత
== మాతో వచ్చేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారు
== వారందర్ని కలుపుకుని పనిచేస్తాం
== మరో నాలుగు రోజుల్లో అధికారికంగా ప్రకటన ఉంటుంది
== ముఖ్యకార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
బీఆర్ఎస్ ను బొంద పెట్టడానికి, మరో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం కన్వన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇది కూడా చదవండి:- వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
హైదరాబాద్ లోనే అందరం కలిసి ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్దానికి సిద్ధం అయ్యామని తెలిపారు. అధికార మదంతో కొందరు విర్రవీగుతున్నారని, మీ అందరి మదిలో ఏముందో నాకర్ధమైనదని అన్నారు. మీ నాయకుడి జండా ఏంటి, అజండా ఏమిటన్నారు. ఓ పార్టీలోకి పోతున్నామంటే విందులు చేసుకున్నారని అన్నారు. కానీ గత వారం నుండి తాగక పోయినా సోల్గుతున్నారని తెలిపారు. సోల్లుకబుర్లు, జోకుడు గాళ్ళు కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు… నా చిరు నవ్వే నీకు సమాధానం… నా చిరునవ్వే నీకు రాజకీయ సమాది… కీ శే ఎన్ఠీఆర్ విగ్రహానికి దందా వేస్తే, శుద్ధి చెపిస్తావా… ఇదా నీ సంస్కృతి అని యద్దేవా చేశారు. ప్రజలే సమాధానం చెప్పే సమయం వచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి:- సీఎంను వదలని పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాదు, యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం ఖమ్మం పై ఉంన్నారు. దీనంతటికీ స్ఫూర్తి నా ప్రజలేనని కుండబద్దలు కొట్టారు. యుద్ధం నేనొక్కడినే చేయలేను… మనందరం కలిసే యుద్ధం చేస్తాం…
పదవే కావాలనుకుంటే, 2018 లొనే ఫిరాయించేవాడ్ని… గడిచిన నాలుగున్నారేళ్లు నాకు పదవి లేదనే ఆలోచనే రాలేదు…పార్లమెంట్ సభ్యుడిని అయితే నాకొక్కడికే పదవి ఉండేది… ఇంతమంది అభిమానం నాకు దక్కేది కాదు..
ఇది కూడా చదవండి:- జై కాంగ్రెస్ నినాదంతో దద్దరిల్లిన పొంగులేటి శిబిరం
ఇక సమయం ఆసన్నమైంది… మరో 3 లేదా 4 రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. కానీ రాష్ట్ర రాజకీయాలు కూడా విశ్లేషించాలని సూచించారు. తెలంగాణా వ్యాప్తంగా మరికొందరిని సమీకరించుకోవాలని, కల్వకుంట్ల కుటుంబ విముక్తిని ఎలా కలగించాలనే సమాలోచనలో పడ్డారుని తెలిపారు. ఖమ్మం నడిబొడ్డునే లక్షలాదిమంది తో పార్టీలో జాయిన్ అవుతానని, కనీవినీ ఎరుగని మీటింగ్ ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. మనం చేరబోయే పార్టీ అగ్రనేతలు అందరూ ఖమ్మం వస్తారని తెలిపారు. ఓ నెలో, రెండు నెలల్లో ఇబ్బందులు ఉంటాయి… నన్నూ అనేక ఇబ్బందులు పెడుతున్నారు, పోలీసులు, అధికారులు కూడా గాలి ఎటు వీస్తుందో చూస్తున్నారని తెలిపారు.