Telugu News

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కందాల చేయూత కార్యక్రమం

ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ

0

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కందాల చేయూత కార్యక్రమం
== ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ
==(తిరుమలాయపాలెం-విజయంన్యూస్)
కష్టాల్లో ఉన్న వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం కందాల చేయూత కార్యక్రమం కింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు సహాయాన్ని అందిస్తున్నట్లు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోపాయిగూడెం పాతర్లపాడు మేకల తండా కుక్కల తండా మేడిదపల్లి దమ్మాయిగూడెం గ్రామాల్లో మృతి చెందిన 31 మంది కుటుంబ సభ్యులను ఓదార్చే ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల నగదును ఆమె చేతుల మీదుగా అందజేశారు

also read :-ముంబై గులాబీమ‌యం.. సీఎం కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్‌

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని ప్రతి పేదవారికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉపేందర్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారని చెప్పారు కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు గోల్డ్ తండా గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు కమిటీ సభ్యులకు విజయమ్మ అందజేశారు

జింకల గూడెం మసీదుకు టెన్త్ సామాగ్రికి 50 వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ చావా వేణు గోపాల కృష్ణ ఎంపీపీ మంగీలాల్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాష బోయిన వీరన్న సర్పంచులు దేవేందర్ రెడ్డి రంగా బిక్ష నాయక్ మంచా నాయక్ ఆలస్యం నాగేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు ఆర్మీ రవి తిరుమలాయపాలెం పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామకూరి రాజు పాతాళ పల్లి సర్పంచ్ రామ్మోహన్రెడ్డి వెంకట్ రెడ్డి మట్ట కృష్ణారావు రావుల వెంకట్ రెడ్డి సలీం పాషా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.