అడవులనుపరిరక్షించడమే శ్రీనివాస రావు కు అర్పించే నివాళి
ఆర్జేసీ కళాశాలలో శ్రీనివాస్ రావుకు నివాళ్లు అర్పించిన ఆర్జేసీ క్రిష్ణ
అడవులనుపరిరక్షించడమే శ్రీనివాస రావు కు అర్పించే నివాళి
== ఆర్జేసీ కళాశాలలో శ్రీనివాస్ రావుకు నివాళ్లు అర్పించిన ఆర్జేసీ క్రిష్ణ
(ఖమ్మం-విజయంన్యూస్)
ప్రతీఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించడ మే నీతి నిజాయితీ ల తో పనిచేసి న ఫారెస్ట్అధికారి చలమల శ్రీనివాసరావు కు అర్పించే నిజమైన నివాళి అని జిల్లా అటవీ శాఖ ఖమ్మంఎఫ్ ఆర్ ఓ, ఆర్జే సికళాశాల పూర్వ విద్యార్ధి రాధిక పేర్కొన్నారు. ఇటీవల మరణించిన అటవీ శాఖ అధికారి,ఖమ్మంఆర్జేసిడిగ్రీ కళాశాల పూర్వ విద్యార్ధి శ్రీనివాసరావు సంతాప సభ శనివారం కళాశాలప్రిన్సిపాల్ యం. శివ కుమార్ అద్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ఎఫ్ ఆర్ ఓ రాధిక, కళాశాలచైర్మన్ గుండాల కృష్ణ అతిథులు గా హాజరై ఆయన చిత్ర పటం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచినివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ శ్రీనివాసరావు చిన్న వయస్సు లోనేమరణించడం బాధాకరం అన్నారు.
ఇది కూడా చదవండి: రాజ్యాంగం అమలువల్లే చిన్న రాష్ట్రాల ఏర్పాటు: ఆర్ జేసీ కృష్ణ
తాను విధినిర్వహణలో ఉన్న సందర్భం లో ప్రతీ క్షణం అడవులపరిరక్షణకు తపించేవారని,అది ఆయన చిత్త శుద్ది ని తెలియజేస్తుందన్నారు. ఆయన కుటుంబానికి తాము ఎల్లవేళలా అండ గా ఉంటామన్నారు.ఆయన ఆశయసాధనకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అదే శ్రీనివాసరావు కుఅర్పించే నివాళి అని పేర్కొన్నారు.కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ తమకళాశాలలో విద్య ను అభ్యసించిన శ్రీనివాసరావు మరణించడం తీవ్రంగా కలచి వేసిందన్నారు.విదుల పట్ల నిబద్దత కలిగిన ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో రఘనాదపాలెం మండల ఫారెస్ట్ రేంజర్ చక్రవర్తి, కళాశాలవైస్ ప్రిన్సిపాల్ ఏ.లింగయ్య,సైన్స్ ఇంచార్జి ఉపేందర్ లతో పాటుపలువురు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మానవ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉంది..మంత్రి పువ్వాడ