Telugu News

గవర్నర్ కు వినతి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.

- ధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశాం.

0

గవర్నర్ కు వినతి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.

— ధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశాం.

— కేంద్రప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి.
— తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగింది.
— తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారు.
— ఈ రాష్ట్ర గవర్నర్ గా ఇది మీరు సంతోషించాల్సిన అంశం.
— తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ ..
— కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుంది.

— రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం వారికి నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దం
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న మంత్రులు హరీష్ రావు , మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ తదితరులు.

also read :-ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో.