ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి కి మంత్రి పువ్వాడ అభినందనలు..
నిన్న మహిళా బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ గా నిఖత్ జరీనా
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డికి మంత్రి పువ్వాడ అభినందనలు..
—నిన్న మహిళా బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ గా నిఖత్ జరీనా..
(ఖమ్మం-విజయం న్యూస్):-
నేడు నిజామాబాద్ జిల్లాకు చెందిన మన తెలంగాణ పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సాహసోపేత వారసత్వాన్ని అత్యున్నత శిఖరమానంగా ఎగురవేసిన అన్వితా రెడ్డికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలిపారు.ఇరవై నాలుగేళ్ల అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని మరోసారి ప్రపంచ పటంలో చిరస్మరణీయం చేసిందన్నారు.
also read;-వ్యవసాయం నిర్వీర్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
మొన్న (మే 16)న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన బిడ్డల సత్తా ఏమిటో చాటిందన్నారు.హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ నిర్వహిస్తున్న హిమాలయాల స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్‌లో ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ టీమ్‌లో భాగస్వామిగా అన్వితా రెడ్డి ఈ రికార్డును సాధించడం రాష్ట్రానికే గర్వకారణం అని వ్యాఖ్యానించారు.