Telugu News

ఎల్లుండి ఖమ్మంలో ఇద్దరు మంత్రుల పర్యటన

== పాలేరు, వైరా నియోజవకర్గంలో పర్యటించనున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ

0

ఎల్లుండి ఖమ్మంలో ఇద్దరు మంత్రుల పర్యటన

== పాలేరు, వైరా నియోజవకర్గంలో పర్యటించనున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ

== మద్దులపల్లి మార్కెట్ యార్డ్, సోసైటీ గోదామ్ నిర్మాణాలకు శంకుస్థాపన

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈనెల 4న ఖమ్మం జిల్లాలలో పర్యటించనున్నట్లు మంత్రుల వ్యక్తిగత అనుచరులు తెలిపారు. పలు అభివద్దిపథకాలకు శంకుస్థాపన నిమిత్తం పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 9గంటలకు నాయకన్ గూడెం గ్రామానికి చేరుకోగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఘనంగా స్వాగతంపలకనున్నారు.

also read :-నేలకొండపల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

అనంతరం ఆ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన రైతు వేదికలను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నేరుగా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణ చేయనున్ మార్కెట్ యార్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తరువాత కూసుమంచి మండలంలోని జక్కేపల్లి గ్రామంలోని పీఏసీఎస్ సోసైటీ గోదామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్యాంఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోజనం చేసి, ఆ తరువాత వైరా నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

also read :-30 కోట్లకు ఐపి పెట్టిన మరో చిట్ వ్యాపారి

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నేలకొండపల్లి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్లు వడ్తియా సెట్రామ్ నాయక్, డౌలే లక్ష్మిప్రసన్న, ఆత్మకమిటీ చైర్మన్ రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు హాజరుకానున్నారు. ఈ మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎండలు తీవ్రతరంగా ఉన్న సందర్భంలో వచ్చే ప్రజలకు, అధికారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.