Telugu News

అంతిమ విజయం మాదే

అందరం ఏకమవుదాం.. దేశంపై జెండా ఎగరేద్దాం

0

అంతిమ విజయం మాదే

== అందరం ఏకమవుదాం.. దేశంపై జెండా ఎగరేద్దాం

== పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్

== బీజేపీ అంతమే అందరి లక్ష్యం : విజయన్

== కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

== దేశంలో మార్పు రావాలన్న పంజాబ్ సీఎం

== ప్రగతి శీల శక్తులు ఏకం కావాలన్న కామ్రెడ్స్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

బీజేపీ రహిత ప్రభుత్వ సాధనలో, ఈ పోరాటంలో అంతిమ విజయం మనదేనని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. దేశాన్ని మతాల పేరుతో, కులాల పేరుతో మనుషుల మద్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అస్తులను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలందరు ఐక్యమవుతున్నాయని తెలిపారు. వారందరి ఆశీస్సుల మేరకే దేశ ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందిని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు

ఖమ్మం నగరంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ అవిర్భవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రులు, విపక్ష నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశం కోసం, దే

శ రక్షణ కోసం అందరం కలిసి పనిచేస్తామని, భారతదేశంపై బీఆర్ఎస్ జెండా ఎగరేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. 2024లో ప్రభుత్వం మనదేనని, బీజేపీ, ప్రధాని ఇంటికి పోవుడుఖాయమన్నారు. మిగిలిన సీఎంలు, మాజీ సీఎం, వక్తలు ఏం మాట్లాడారో చూద్దాం.

 

 

== కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దేశాన్ని అభివృద్ధి

 చేయడం ఎలా.. రైతులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలనే దానిపైన ఇవాళ ముఖ్యనేతలందరం కలిసి చర్చించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.

== కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటివారు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 

కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటివారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని, కంటి వెలుగు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లోనూ ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని కొనియాడారు.

 

 

== బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు కేరళ సీఎం పినరయి విజయన్‌

ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారని పినరయి విజయన్‌ అన్నారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ సర్కార్‌ అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ కేసీఆర్‌ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు ఉంటుంది. ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది.దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది.

ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్’ పుల్ జోష్.. సీఎం ఖుషి

బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది. రాష్ట్రాల సమ్మేళనమే దేశం. ఫెడరల్‌ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోంది. కీలక నిర్ణయాల్లో కేంద్రం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి పాలిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్‌ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం నైతిక విధానాలను ఆచరిస్తోంది. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మోడీ కార్పొరేటర్లకు తొత్తుగా మారారు. మోడీ పాలనలో ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటోంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ అని పినరయి విజయన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

== గవర్నర్‌ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారిపోయాయి: కేరళ సీఎం

 దేశంలో గవర్నర్‌ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారిపోయాయని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. కేంద్ర మంత్రులు.. నేరుగా సుప్రీం కోర్టును బెదిరిస్తున్నారని అన్నారు. . ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడరని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు.

== సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతం: కేరళ సీఎం

 తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్‌ కొనియాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. లక్షలాది మందికి ఉపయోగపడే కంటి వెలుగు పథకం అద్భుతమని కొనియాడారు.

== దేశానికి ఈ సభ ఒక దిక్సూచీ: కేరళ సీఎం

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ దేశానికి ఒక దిక్సూచి అని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.

== బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ : పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌

తెలంగాణలో అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అద్భుతమని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ కొనియాడారు. ఖమ్మం సభలో భారీ జనసందోహాన్ని చూసి భగవంత్‌మాన్‌ ఉప్పొంగిపోయారు. ఇంతమందిని చూడటానికి కేసీఆర్‌ తమకు ప్రత్యేక అద్ధాలు ఇవ్వాలంటూ చమత్కరించారు.బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని అన్నారు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీ సూత్రం అని విమర్శించారు. అన్ని సమయాలు ఒకేలా ఉండవని, రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమనే పుష్ఫగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ కొందరు ఒకే రకమైన పువ్వును కోరుకుంటున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి:    ఖమ్మంలో రెండవ విడుత కంటి వెలుగు షురూ..

 

== బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం: యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ సభపై ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అశిలేశ్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్న అఖిలేశ్‌ యాదవ్‌.. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.

 

 

 

== బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి: డీ. రాజా

దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు. భారత దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పుగా తయారయ్యాయని అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు.

== బీజేపీని అంతమొందించడం కోసమే బీఆర్ఎస్ పోత్తు: తమ్మినేని

బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రధాన కారణం ఉందని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న, దేశ ప్రజల జీవితాలను కార్పోరేట్ శక్తుల చేతిలో పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోవడం మంచిదని భావించి నిర్ణయం తీసుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీని గద్దే దించడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ప్యూడల్ వ్యవస్తను నాశనం చేయాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా అభివద్ది గురించి ఆలోచించాలని, సీతారామ ప్రాజెక్టును త్వరగా పరిష్కరించాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, భద్రాచలంలో గిరిజన సోసైటిని మంజూరు చేయాలని, ఖమ్మంలో యూనివర్సిటిని మంజూరు చేయాలని, గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.

== కార్మికుల హక్కులను కాలరాసింది కేంద్రం : కూనంనేని

కార్మికుల హక్కులను కాలరాసింది కేంద్రమని, ప్రజల అవసరాలకు ఉపయోగపడే నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజా జీవన వ్యవస్థనే నాశనం చేసిన బీజేపీని గద్దేదించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాజ్యంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వాన్ని దించేందుకు మనంతా ప్రయత్నం చేయాలని అన్నారు.