Telugu News

ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.

సమావేశంలో మహిళా సర్పంచ్ ఉండగా భర్త పెత్తనం . అతనిని అధికారులు లోనికి ఎలా రానిచ్చారు.

0

ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.

సమావేశంలో మహిళా సర్పంచ్ ఉండగా భర్త పెత్తనం .
అతనిని అధికారులు లోనికి ఎలా రానిచ్చారు.

(పెద్దపల్లి – విజయం న్యూస్):

మంగళవారం రోజున ముత్తారం మండల సర్వసభ్య సమావేశం లో సమావేశానికి మహిళా సర్పంచ్ ఉండగా సర్పంచ్ భర్త ను లోనికి ఎలా అనుమతించారు. అది ఎలా మహిళల సాధికారిక నినాదం ఆచరణలో అమలు కావడం లేదు, అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు ఆధునిక సమాజంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అనుభవించలేక పోతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారంత తమ ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కానీ అడుగు ముందుకు వేయడం లేదు. వారి స్థానాలలో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. మహిళా సాధికారికత కలగానే మిగిలిపోతుంది. మండలంలోని పలు పంచాయతీలో మహిళా సర్పంచ్, ఎంపీటీసీ లను మన ప్రజలు నమ్మకంతో వారికి ఓట్లు వేసి గెలిపించారు. కానీ వారు వంటింటికే పరిమితమవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో మహిళ సర్పంచ్ ల ముఖం కూడా స్థానిక అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. మహిళా ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తే వారి భర్తలు, లేక కుటుంబ సభ్యులు తామే సర్పంచుల మని, ఎంపీటీసీ సభ్యులని చెబుతుంటారు. కొన్ని గ్రామాల్లో నైతే వారి సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు తమ పేరు తగిలించుకుంటున్నారు.

ALSO READ :-ఖమ్మంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

అధికారులతో మాట్లాడే సమయాల్లోనూ, అధికారిక శిలాఫలకాల్లో, పత్రికా ప్రకటన లో తమ భార్యల పేరు చివరన తమ పేరు రాసుకుంటున్నారు. అదే పురుషులు ఉన్న చోట మాత్రం వారి సతీమణుల పేర్లు బయటకు రావడం లేదు. కేవలం మహిళల అధికారాలను హరించడానికే సతుల పక్కన పతుల పేర్లు పెట్టుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చాలా పకడ్బందీగా రూపొందించామని చెప్పిన సర్కారు సతుల పదవిలో పతుల పెత్తనం గురించి ఏం రాసిందో వారికి వివరించ లేదా….? లేక …. మాకు ఏం కాదు, అనే ధీమాతో ఉన్నారా…? మండలములోని ఓ సర్పంచ్ భర్త అధికారమే చెలాయించడంమే కాకుండా అధికారులను తరచూ బెదిరిస్తుంటాడు. సాధారణ విషయాన్ని కూడా దురుసుగా చెప్పడం అతని ప్రత్యేకత. మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించవద్దని అనేక మార్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. సభలు, సమావేశాల్లో మహిళా ప్రజా ప్రతినిధి కి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీ రాజ్‌ చట్టం 2018 సెక్షన్‌ 37 (5) ప్రకారం చర్యలు తీసుకోవాలి.

ALSO READ :- అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి మహిళ నిండు ప్రాణం పోయింది…!

వీరిని అధికారిక సమావేశానికి అనుమతి ఇస్తే పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్‌ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు చర్యలు తీసుకుంటారని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్న ఆచరణలో మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు,ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనా పరమైన అన్ని విషయాలు తెలియాలి.కానీ కొన్ని చోట్ల వారికి పంచాయతీలు ఏ పనులు చేశాము అనే విషయం కూడా కొంత మంది మహిళా సర్పంచులకు తెలియదు. ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు మహిళ ప్రజా ప్రతినిధులు తమ దైన శైలిలో రాణిస్తున్నారు. అధికారులను, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు.