క్రీడాల్లో మట్టిలో మాణిక్యాలున్నారు: భట్టి
== వారందర్ని ప్రతిభను వెలికతీస్తే భారత్ కు పతకాల పంటే
== రాజీవ్ గాంధీ మెమోరియల్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలను అందజేసిన సీఎల్పీ నేత భట్టి
(ఖమ్మం-విజయంన్యూస్)
గ్రామీణస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చే క్రీడాకారులు ఉన్నారని, వారందరు మట్టిలో మాణిక్యాలేనని, వారి ఆటను, ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తే భారత్ కు పతకాలు పంటే పండుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ఎస్ యుఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ మెమోరియల్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్, తిరుమలాయపాలేం విజేతగా నిలిచింది, ఎస్బీఐటీ కళాశాల సెకండ్ విన్నర్ గా నిలిచింది అని జిల్లా సంఘం అధ్యక్షులు వెగినాటి ఉదయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: చిరు వ్యాపారులతో సీఎల్పీ నేత మాటముచ్చట
ఈ నెల 5 తేదీ నుండి నేటి వరకు సోనియాగాంధీ జన్మదినోత్సవ సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఈ టోర్నీలో మొత్తం 28 టీమ్ లు పాల్గొన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజేతలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేతుల మీదుగా రాజీవ్ గాంధీ మెమోరియల్ -2022 మెమెంటో అందచేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏ అవసరం ఉన్నా పార్టీ తరపున అండగా ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రమ్, సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు జావిద్, సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు జి మోహన్, జిల్లా కార్యదర్శి నవీన్, తిరుమలయపాలేం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్, తాళ్ళపల్లి సురేష్, ఇరు కాలేజ్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు
ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్ లో పదవుల జోష్